న్యూస్ పేపర్లను చదవి అలవాటు చాలామందికి ఉంటుంది.ఫ్రంట్ పేజీలో పబ్లిష్ అయ్యే వార్తలకు ఉండే ప్రయారిటీనే వేరు. అలాంటి పేజ్ వన్ లో ఎలాంటి వార్తలు లేకుండా.. నల్లరంగులో నింపేశాయి దాదాపు అన్ని ఆస్ట్రేలియన్ మీడియా సంస్థలు.ది ఆస్ట్రేలియన్, ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ఫైనాన్షియల్ రివ్యూ, డెయిలీ టెలిగ్రాఫ్ వంటి టాప్ సేల్స్ ఉన్న దిన పత్రికల ఫస్ట్ పేజీలు నల్లరంగులో వెలువడ్డాయి.


వివరాల్లోకి వెళ్తే ....  కొద్దిరోజులుగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రహస్య విధానాలను పాటిస్తోందట. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదనేది ఆరోపణ.పరిపాలన మొత్తం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. మీడియాను అణచివేసే ధోరణికి పాల్పడుతోందని విమర్శిస్తున్నారు.ఆస్ట్రేలియాకు చెందిన దాదాపు అన్ని మీడియా సంస్థల నుంచి వెలువడిన దినపత్రికలన్నీ నల్లరంగును పులముకుని కనిపించాయి.ఈ వైఖరిని పట్ల మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లు.. ఫస్ట్ పేజీలను నల్లరంగుతో నింపేసి నిరసన వ్యక్తం చేశారు.మీడియా మొనార్క్ గా భావించే రూపర్ట్ ముర్డోక్ కు చెందిన న్యూస్ కార్పొరేషన్, నైన్ ఎంటర్ టైన్ మెంట్స్ యాజమాన్యానికి చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ది ఏజ్, హెరాల్డ్ సన్ సహా దాదాపు అన్ని దినపత్రికల ఫ్రంట్ పేజీలు ఇదే తరహాలో దర్శనం ఇచ్చాయి.అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో పాఠకులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనంటూ మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారట.


ఓ సామాజిక సంస్థ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ది ఆస్ట్రేలియన్ సహా కొన్ని దినపత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. దీనిపై ప్రభుత్వం వివరణ కోరింది. దీనికి అనుగుణంగా వివరణలు ఇచ్చుకున్నాయి కూడా. అయినప్పటికీ- ప్రభుత్వం మెత్తబడలేదు. మెట్టు దిగలేదు.ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పుకొనే మీడియాపై ఆంక్షలు విధించడం, తాము చెప్పినట్టు వినాలనే ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము ఈ చర్యలు తీసుకున్నట్లు మీడియా, ఎంటర్ టైన్ మెంట్, ఆర్ట్స్ అలయన్స్ (ఎంఈఏఏ) ప్రధాన కార్యదర్శి పాల్ మర్ఫీ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: