ఎస్సీ,ఎస్టీ సామాజికవర్గాలు....రాష్ట్రంలో ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే వీరి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ ప్రభుత్వామైన ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే దివంగత వైఎస్సార్ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఎక్కువ పథకాలు ప్రవేశ పెట్టడంతో...వారి మద్ధతు వైఎస్ ఫ్యామిలికే ఎక్కువ ఉంటుంది. వైఎస్ మరణం తర్వాత వారు ఆయన తనయుడు వైఎస్ జగన్ వెంట నడిచారు. అందుకే 2014 ఎన్నికల్లో కూడా ఓడిపోయిన వారు వైసీపీకే ఎక్కువ మద్ధతు ఇచ్చారు.


ఇక మొన్న ఎన్నికల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ ఓట్లు వైసీపీకే దక్కాయి. అందుకే ఆ పార్టీ భారీగా సీట్లు దక్కించుకుంది. అయితే తమ పార్టీకి ఇంతలా మద్ధతు తెలుపుతున్న ఎస్సీ, ఎస్టీల కోసం జగన్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందరికి దక్కే పథకాలు ఎస్సీ,ఎస్టీ వారికి దక్కుతూనే ఉండగా, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా మరికొన్ని పథకాలు తీసుకొచ్చారు. ముందు పార్టీలోనే ఒక ఎస్సీ, ఎస్టీకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. అలాగే కొందరికి మంత్రి పదవులు కూడా దక్కాయి.


అదేవిధంగా బీసీ, మైనారిటీలతో పాటు, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అలాగే ఆలయ పాలక మండళ్ళలో కూడా ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. అటు గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు పరుస్తూ...కటాఫ్ ని కూడా తగ్గించారు. ఆఖరికి 0 మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇచ్చారు.


ఇక ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ పరిమితి 100 నుంచి 200 యూనిట్లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సీడీ లోన్లు ఇస్తున్నారు. వైఎస్సార్‌ కళ్యాణ కానుక కింద.. ఎస్సీ, ఎస్టీ యువతులు వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నారు. త్వరలోనే 45 ఏళ్ళు దాటిన ఎస్సీ,ఎస్టీ మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేల సాయం చేయనున్నారు. ఇవేగాక వారి సంక్షేమం కోసం జగన్ అనేక పథకాలు తీసుకురానున్నారు. మొత్తానికి వీటి వల్ల జగన్ కు ఎస్సీ, ఎస్టీల మద్ధతు ఇంకా పెరిగిందనే చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: