ఏపీ సీఎం జగన్ ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వెనక్కి తగ్గరనే విషయం తెలిసిందే. ఏదైనా నిర్ణయం తీసుకున్న అది విజయవంతంగా అమలు అయ్యేవరకు కృషి చేస్తారు. ఒకవేళ సాధ్యం కానిది ఏమైనా ఉంటే...దాని జోలికి కూడా వెళ్లారు. ఉదాహరణకు గత టీడీపీ ప్రభుత్వం చెప్పి...రైతులకు హ్యాండ్ ఇచ్చిన రుణమాఫీ పథకం. ఆ పథకం సాధ్యం కాదని జగన్ ముందే చెప్పేశారు. అయితే సీఎం అయిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. వాటిని అమలు చేస్తూనే ఉన్నారు.


ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు జగన్ నడుం బిగించారు. అయితే అనుకున్న వెంటనే ఈ కార్యక్రమం జరిగిపోదు. అందుకే రెండేళ్ళు సమయం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని జగన్ సరికొత్త ప్రణాళికలు రచిస్తూ ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే పాఠశాలల రూపు మార్చేందుకు రూపొందించిన "మన బడి నాడు - నేడు" కార్యక్రమాన్ని నవంబర్ 14 న ప్రారంభిస్తున్నారు.


తొలిదశలో 15వేల పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి అభివృద్ది పరచనున్నారు. దీనికోసం బడ్జెట్ లో రూ. 1500 కోట్లు కూడా కేటాయించారు. ముఖ్యంగా పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్లు, బోర్డులు ఏర్పాటు తదితర అంశాలను సత్వరం అభివృద్ది చేయనున్నారు. అయితే పాఠశాలలు రూపు రేఖలు మారాయో లేదో ప్రజలు ముందే పెట్టనున్నారు. ముందు పాత పాఠశాలల ఫోటోలని తీసుకుని, తర్వాత వాటిని అభివృద్ధి చేసిన ఫోటోలని ప్రజలకు చూపించనున్నారు.


అటు అక్షరాస్యత పెంచడానికి కూడా జగన్ అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా బడికి పంపే ప్రతి విద్యార్ధి తల్లికి రూ. 15 వేలు అందించనున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక జగన్ పట్టుదల, ప్రణాళికలు చూస్తుంటే రెండేళ్లలోనే పాఠశాల రూపు రేఖలు మార్చి , తన లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: