ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరింత దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది.  ఒకవైపు నేతలు పార్టీ వీడిపోతుంటే...మరోవైపు ఓటమి నుంచి పార్టీ ఇంకా కోలుకోలేదు. కొన్ని జిల్లాల్లో అయితే పార్టీ అసలు ఉందా అన్నట్లుగా అయిపోయింది. వాటిల్లో ఒక్కసీటు కూడా తెచ్చుకొని విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పరిస్తితి ఘోరతిఘోరంగా ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో టీడీపీ సోదిలో లేదు. విజయనగరం, కడప, కర్నూలు జిల్లాలల్లో తక్కువ స్థానాలు ఉంటాయి. కానీ కర్నూలు జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి.


ఇలాంటి జిల్లాలో పార్టీ బలపడటం ఎంతైనా ముఖ్యం. కానీ టీడీపీ నేతలు అవేమీ పట్టనట్లుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ జిల్లా నుంచి ఒక్క నేత కూడా పార్టీ కోసం కష్టపడటం లేదు. భూమా ఫ్యామిలీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ...తన భర్తపై నమోదైన కేసులపై పోరాడుతున్నారు. ఆమెకు పార్టీ మద్ధతు ఏ మాత్రం దక్కడం లేదు. అటు ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం సైలెంట్ గా ఉంది. మొన్న ఎన్నికల్లో కోట్ల కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా, ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


అధికారంలో ఉండగా జిల్లాపై పెత్తనం చేసిన కెఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ కూడా యాక్టివ్ గా లేదు. వయసు రీత్యా కెఈ మొన్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కుమారుడుకు పత్తికొండ టికెట్ ఇప్పించుకున్నారు. కానీ అనూహ్యంగా కెఈ శ్యామ్ ఓటమి పాలయ్యారు. అటు కెఈ సోదరుడు ప్రభాకర్ కూడా డోన్ నుంచి ఓడిపోయారు. ఇక రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ బీజేపీలోకి వెళ్లిపోతే, ఆయన తనయుడు టీజీ భరత్ టీడీపీలోనే కొనసాగుతున్నారు. భరత్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


ఇక ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడులు అడ్రెస్ లేరు. మొత్తానికి కర్నూలు జిల్లాలో టీడీపీ ఇప్పటిలో కోలుకోవడం కష్టమే.


మరింత సమాచారం తెలుసుకోండి: