బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ముఖ్యంగా ఈరోజు (మంగళవారం), రేపు (బుధవారం) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

 

మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. మంగళవారం నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.

 

అలాగే బుధ, గురు వారాల్లో కూడా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోని వాగులు, వంకలు, నదులు భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపిన ఆర్టీజీఎస్‌.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరింది. మధ్య భారతంలో వచే​ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: