ఆర్టీసీ కార్మికులు  గత 18 రోజులుగా సమ్మె చేస్తున్న,సంగతి అందరికి తెలిసిందే.ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే అంశంపై సీఎం కేసీఆర్ ఒక  కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించిన హైకోర్టు ఆర్డర్ పై కాపీలు ప్రభుత్వానికి అందాయి. దీనిపై ఏం చేయాలనే అంశంపై మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నత అధికారులతో సీఎం కేసీఆర్ ముఖ్య సమావేశమయ్యారు.

ఓ వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే... మరో వైపు  ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సీఎం కేసీఆర్ సమావేశంలో పాల్గొన్న అధికారులు, మంత్రికి సూచించినట్టు తెలిసింది.ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్లపై చర్చించేందుకు సర్కారు సానుకూలంగా ఉన్నట్టుగా  సమాచారం.ఆర్టీసీ కార్మికులు సమ్మెను వీడాలని ప్రభుత్వంతో చర్చలు జరపాలని టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు ఇటీవల చేసిన సూచనలతో.. ప్రభుత్వం ఓ మెట్టు దిగిందని భావిస్తున్నారంతా.చర్చలు జరిగే అవకాశం ఉందని ఆశించారు.

కానీ బుధవారం రాత్రి ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రితో కేసీఆర్ చర్చలు జరిగిన తర్వాత.. చర్చలకు ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. కేసీఆర్ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం గురించి అధికారులతో చర్చించారని బుధవారం రాత్రి సీఎంవో ప్రకటించింది. కానీ ఆర్టీసీ సమ్మెపైనే సీఎం చర్చించినట్టు సమాచారం.

ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మిక సంఘాల నేతలు చర్చించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమ్మె విరమించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి డిమాండ్లను పక్కన పెట్టి,కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.. ఈ అంశంపై హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మొత్తానికి ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో అని  ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం .



మరింత సమాచారం తెలుసుకోండి: