ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు . వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని  ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు  . ప్రగతిభవన్ లో  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఆర్టీసీ,  రవాణా శాఖ ఉన్నతాధికారులతో దాదాపు ఐదు గంటలపాటు  జరిపిన సమీక్ష సమావేశంలో కేసీఆర్  గతం లో చేసిన ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పకనే చెప్పారు .


  ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న ఆయన ,  ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కార్మికులకు తిరిగి  ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేదని  కుండబద్దలు కొట్టారు.   తమ న్యాయమైన  డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే . అయితే సమ్మెకు వెళ్లిన కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని గతంలో కేసీఆర్  ప్రకటించారు . దాదాపు  48  వేల మంది కార్మికులు తమంతట తామే  విధుల్లో నుంచి వైదొలిగారని పేర్కొన్నారు.   ఆర్టీసీ  నష్టాలకు కార్మిక సంఘాలే కారణమన్న కేసీఆర్ , ఆర్టీసీ లో యూనియన్లు లేకపోతే  లాభాల బాట పడుతుందని అధికారులతో చెప్పారు.


 నష్టాల్లో ఉన్న సంస్థ లో  ఉద్యోగుల జీతాలు పెంచమని ఎవరు చెప్పారని , ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిని , నష్టాలను   కోర్టు ముందు పెట్టాలని సూచించారు .  గతం ఆల్విన్ సంస్థ  లాకౌట్ అయితే ఎవరు మాత్రం ఏం చేశారన్న అయన ,  ఆర్టీసీ  మరో ఆల్విన్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు .  ఆర్టీసీ సమ్మె కారణంగా  ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మరింత ముమ్మరం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు


మరింత సమాచారం తెలుసుకోండి: