సీనియర్ ఎన్టీఆర్ కి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో వరుసగా ఆరు హిట్స్ తో టాప్ హీరోగా దూసుకెళ్తున్నారు. మరి రాజకీయాల్లో..? జూనియర్ రాజకీయాల్లోకి రావాలని ఈ మధ్య తెలుగు తమ్ముళ్లతో పాటు టీడీపీ సానుభూతి పరులు కూడా బలంగా కోరుకుంటున్నారు. తాజాగా నెల్లూరు చంద్రబాబు పర్యటనలో కూడా ఇదే విషయాన్ని బలంగా వినిపించారు. అలాగే ఇటివలే గిరిబాబు లాంటి సీనియర్ నటులు కూడా టీడీపీకి భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆరే అని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, టీడీపీ నాయకుల్లో మాత్రం  'జూనియర్' అంటే  ఇంకా ఎక్కడో చిన్న చూపే.  ఈ విషయం మీద నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ ఇటీవల చేసిన వాఖ్యలు విన్నాం కదా.  ఏమైనా  ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో   టీడీపీ పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి ఇంకా ప్రజలకు గుర్తు ఉంది.  అంతటి దారుణమైన ఓటమినుండి కోలుకున్నాక ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయాలనీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నాడు.  కానీ,  జగన్ ప్రభంజనంలో చంద్రబాబు ప్రణాళికలు ఏ మాత్రం  ప్రభావం చూపలేకపోతున్నాయి.  ఈ క్రమంలోనే  ఏపీలో పార్టీ బలోపేతం కావాలంటే  జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని, భవిష్యత్తులో పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి అప్పగించాలనే చర్చ   టీడీపీ సమావేశాల్లో బాగానే  జరిగిందని సమాచారం. 

  ఈ విషయం మీద అటు చంద్రబాబు కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఇటీవల జరిగినటువంటి ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ మరియు చంద్రబాబు గారు కలుసుకొని కొద్దీ సేపు రాజకీయాలు గురించే  చర్చించారని సమాచారం. ఈ సమావేశంలో ఎన్టీఆర్ మనసులో ఏముందో అని గ్రహించిన బాబు, టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఎంతమేరకు కూడా లేదని పార్టీ నాయకుల చేత అనిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఇప్పటికైనా బాబు తన పుత్ర వాత్సల్యం కట్టిపెట్టి.. పార్టీని తన తరువాత సమర్ధవంతమైన వ్యక్తి చేతిలో పెడితే.. టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే.. పార్టీనే కాల గర్భంలో కలిసిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నట్టయితే టీడీపీ పార్టీని  పెద్ద ఎత్తున దెబ్బ తియ్యటానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరో పక్క బాబు పై వైసీపీ నాయకులూ  తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ యువ నేతగా పట్టం కడితే.. తెలుగు తమ్ముళ్లకు భవిష్యత్తు పై ఆశ కలుగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: