ఆర్టీసీ సమ్మెతో నగర జీవనమంతా అస్తవ్యస్తంగా మారింది. సమయానికి రాని బస్సులు, వచ్చిన బస్సులలో టికెట్స్ సరిగ్గా కొట్టడానికి రాని కండక్టర్స్. ఇంతేకాకుండా బస్సులు నడిపే డ్రైవర్లని చూస్తుంటే ప్రయాణికుల గుండెలు భయంతో దడదడలాడుతున్నాయి. క్షేమంగా గమ్యాన్ని చేరుతామో లేదో అనే తెలియని భయం లోలో కదలాడుతుంది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఈ సమ్మే అని అర్ధం కాని పరిస్దితుల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ తమ అవసరాలు ఒడ్డెక్కించుకుంటున్నారు. ఇకపోతే హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవవన్‌లో అధికారులతో సమీక్ష జరిపారు.


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీకి ఎండిగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఈ కమిటీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి ఆర్టీసీ ఎండీకి నివేదిక అందిస్తుంది. ఇకపోతే ఈ కమిటీ హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందిస్తుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఇకపోతే మొదట కార్మిక సంఘాల నాయకులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని ప్రకటించారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్టబోమని తెలిపారు. అదీగాకుండా కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా విలీనం ఒక్కటే ప్రధాన డిమాండ్  కాదని  చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.


దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ డిమాండ్లు పరిశీలించి, వాటిపై అధ్యయనం చేయండని సీఎం ఆదేశాలు జారీ చేశారు...ఇకపోతే వీలైనంత త్వరగా ఆర్టీసీ సమ్మె ముగిస్తే బాగుంటుందని నగర ప్రజలు, విద్యార్దులు కోరుకుంటున్నారు. ఇప్పటికే విద్యార్దులు ఈ సమ్మె వల్ల నష్టపోయారు. ఇప్పుడు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడానికి కష్టపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: