అక్టోబర్ 22తో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా 55వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.  ఈ సందర్భంగా అమిత్ షాకు  ఎంతో మంది ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసారు. 1964 అక్టోబర్ 22న జన్మించిన  అమిత్ షా దేశంలో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు అమిత్ షాపై ప్రధాని మోడి ప్రశంసల జల్లు కురిపించారు. 

అమిత్ షా గొప్ప కార్యదక్షకుడు, అత్యంత అనుభవశాలి అని కితాబిచ్చారు.  మన దేశ రక్షణ, సాధికారత విషయాల్లో అమిత్ షా భాగస్వామ్యం మహోన్నతమైనదని అన్నారు.  నా కేబినెట్ సహచరుడు అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడే మనస్తత్వం, అనుభవం, కార్యదక్షత కలబోసిన గొప్ప వ్యక్తి అమిత్ షా. భారత ప్రభుత్వంలో కీలక పాత్రను పోషిస్తూనే… దేశ రక్షణ, సాధికారత అంశాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.


ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన నిండు జీవితాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ హిందీలో మోడి ట్వీట్ చేశారు.. 2014 నుంచి బీజేపీని జాతీయ స్థాయిలో ఆయన నడిపిస్తున్నారు. ఆయన సారథ్యంలో 10 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజీకీయ పార్టీగా బీజేపీ అవతరించింది. క్రికెట్ ను ఎంతో అభిమానించే అమిత్ షాకు… హిస్టరీ, లిటరేచర్ అంటే అమితాసక్తి ఉంది. అమిత్ షా జన్మదినం సందర్భంగా పార్టీలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ ముఖ్య మంత్రి స్వయంగా అమిత్ షా ని కలిసి విష్ చేసారు. ఇక  హ్యాపీ బర్త్ డే అమిత్ షా జీ… ఈ పుట్టినరోజు మీకు చిరస్మరణీయం కావాలని కోరుకుంటున్నానాని, ఈ ఏడాది మీకు అంతా మంచే జరగాలని, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానుఖి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: