రెడ్ అల‌ర్ట్ జారీ చేసే అంత వ‌ర‌ద‌లు.సోమవారం ఒక్కరోజే 20 సెం. మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇదంతా...కేరళలో వరుణుడు బీభత్సం గురించి. ఎన్నికల పోలింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ర్టంలోని తిరువనంతపురం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇలాంటి స‌మ‌యంలో...కేరళలోని ఎర్నాకుళం కాంగ్రెస్ ఎంపీ హిబి ఈడెన్ భార్య అన్నా లిండా ఈడెన్ ఫేస్‌బుక్‌లో విధి లైంగికదాడిలాంటిది అంటూ విశ్లేషించారు.  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.


సోమవారం కురిసిన వర్షానికి పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా కొల్లం, పతనంతిట్ట, కోజికోడ్, మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలకు కొచి నగరం నీట మునిగింది. రోడ్లపైకి నీరు చేరడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న ఎర్నాకుళంలోని పోలింగ్ బూత్‌లలోకి వాన నీరు వచ్చి చేరింది. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లోని పట్టాలపైకి వర్షపు నీరు చేరడంతో పలు రైళ్లు రద్దయ్యాయి.


ఇలాంటి స‌మ‌యంలో అన్నాలిండా ఫేస్‌బుక్‌లో రెండు వీడియోలను సోమవారం షేర్ చేశారు. ఇందులో భారీ వర్షాలకు సోమవారం కొచ్చిలోని ఇంటి చుట్టూ వరదనీరు చేరడంతో తమ కూతురును రబ్బరుబోటులో తరలిస్తున్న దృశ్యం ఒకటికాగా, తన భర్త హిబి ఈడెన్ ఆహారం తింటున్న దృశ్యం రెండోది. ఆ వీడియోలకు ఆమె ``విధి లైంగికదాడి లాంటిది. ఒకవేళ దాన్ని నువ్వు ప్రతిఘటించకపోతే.. అప్పుడు ఆస్వాదించేందుకు ప్రయత్నించు`` అంటూ ఉచిత బూతు నీతులు చెప్తూ క్యాప్షన్ పెట్టారు. దీనిపై స‌హ‌జంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అన్నా లిండా మంగళవారం స్పందించారు. లైంగికదాడులను కీర్తించాలన్నది తన ఉద్దేశం కాదని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.  మహిళలను అగౌరవపరచాలన్నది త‌న ఉద్దేశం కాదంటూ...వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: