తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇప్పటికే ఈ నెల 19న తెలంగాణ బంద్ నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ... తాజాగా తమ  భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపి సిపిఐ సిపిఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను  ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు... మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించిన పార్టీలన్నీ సమ్మెపై కేసీఆర్ నిరంకుశ వైఖరిని వ్యవహరిస్తున్నారని ... కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. అంతేకాకుండా కార్మికులకు మద్దతు తెలిపిన  బిజెపి పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే... ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. 

 

 

 

 అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరుకున్నప్పడికి  కూడా... ఆర్టీసీ సమ్మె  పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మొండిపట్టు వీడటం  లేదు. అయితే తాజాగా ఆర్టిసి కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు  ప్రభుత్వానికి ఆదేశించడంతో... కోర్టు ఆదేశాల పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్,  ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిన్న సాయంత్రం సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కెసిఆర్. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె పై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అనైతికమైనదని  తెలిపారు. 

 

 

 

 

 ఆర్టీసీ రూట్లు ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వమే అధికారం ఇస్తూ చట్టం చేసిందని  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట వ్యతిరేకమైనది... అలాంటి సమ్మెకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ నేతలు మద్దతు ఇవ్వడం అనైతికమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే ప్రధాని మోడీ  ఆర్టీసీ ప్రైవేటీకరణ కు చట్టం తీసుకు వచ్చారని... ప్రధాని మోదీ తీసుకొచ్చిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీనిపై బిజెపి నేతలు అనవసర రాద్ధాంతం చేయడం పనికి రాదన్న  కెసిఆర్... మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీపై కూడా నిప్పులు చెరిగారు. మధ్యప్రదేశ్లో  దిగ్విజయ్ సింగ్ హయాంలో ఆర్టీసీ  మూతపడిన విషయం కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిదని కెసిఆర్ హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: