సుప్రీం కోర్టు వివాహితులైన వారు ఇష్ట పూర్వకంగా వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదు అని ఏ క్షణాన పేర్కొందో. అప్పటినుండి తప్పుచేసే వారికి అడ్డులేకుండా పోయింది. ఈ నిబంధనను అలుసుగా తీసుకుని సమాజంలో ఇష్టాపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఇంకొందరు ఈ చట్టాన్ని తమకు అనువుగా మార్చుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ వివాహేతర సంబంధాలవల్ల జరిగే మేలు దేవుడెరుగు కాని ఎంతమంది భార్యలు, భర్తలు దీనిభారిన పడి తమ ప్రాణాలను సులువుగా తీసుకుంటున్నారు. లేదా ఒకరినొకరు కక్షతో చంపుకోవడం చేస్తున్నారు..


ఈ చట్టం వల్ల జరిగే నష్టాన్ని లెక్కవేయడం కష్టం. ఇకపోతే ఒక టీడీపీ నాయకుడికి వివాహేతర సంబంధం కేసులో మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్‌ సివిల్‌ జడ్జ్టి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు. వివరాలు తెలుసుకుంటే. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య గత కొంతకాలంగా తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దొంగ గుట్టు ఎన్నాళ్లు దాగుతుంది. ఒకరోజు విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్‌ మనస్తాపానికి గురై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకుని మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.


ఈ ఘటనపై మృతుని అక్క ఫిర్యాదు చేయగా ఆమేరకు బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈశ్వరయ్య, అతడి మరదలు రాధపై సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటినుండి దర్యాప్తు కొనసాగుతుండగా సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయిలు ఈశ్వరయ్య, రాధలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పు వెలువరించారు. చూసారుగా ఇద్దరు చేసిన తప్పుకు ఒకరి ప్రాణం పోగా మిగతా ఇద్దరి జీవితం నలుగురిలో నవ్వులపాలై, పరువు పోడగొట్టుకుని జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: