ఊస‌ర‌వెల్లి రంగులు ఎందుకు మార్చుతుందో తెలియ‌దు. ఊస‌ర‌వెల్లి ప్ర‌మాదం వ‌స్తుందంటే వెంట‌న ఆ ప్రాంతానికి త‌గిన విధంగా త‌న రంగును మార్చుకుంటుంది.. తిండిని  సంపాదించుకునే క్ర‌మంలో ఆకులో ఆకై.. పువ్వులో పువ్వై.. అదే రంగులోకి మారి వ‌చ్చేపోయే కిట‌కాల‌ను తిని బ‌తుకుతుంది. ఇలా త‌న ర‌క్ష‌ణ కోసం.. త‌న పొట్ట నింపుకోవ‌డం కోసం రంగులు మార్చే ఊస‌ర‌వెల్లిని నిత్యం మ‌నం చూస్తామో లేదో కానీ.. ఇప్పుడు ఈ రాజ‌కీయ ఊస‌ర‌వెల్లిని మాత్రం నిత్యం చూస్తూనే ఉన్నాము.. ఇంత‌కు రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి ఎవ్వ‌రు అనుకుంటున్నారా.. ఇంకెవ‌రు ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని డాబులు చెప్పుకునే చంద్రబాబు కాకుండా మ‌రెవ‌రై ఉంటారు అనుకుంటున్నారు.


అధికారం కోసం ఐదేండ్ల నుంచే పోరాటం చేస్తూ అవ‌స‌ర‌మైన చోట‌.. కానీ చోట మాట‌లు మార్చుతూ.. పూట‌కో మాట మాట్లాడుతున్న చంద్ర‌బాబు ను చూస్తుంటే ఊస‌ర‌వెల్లి గుర్తుకొస్తుంది. బాబోరు మార్చుతున్న మాట‌లు.. పాడుతున్న పాట‌లు.. తీస్తున్న కుంటిసాకులు చూసి ఊస‌ర‌వెల్లి కూడా సిగ్గుతో త‌ల‌దించుకునేలా ఉంది వ్య‌వ‌హారం. ఇంత‌కు చంద్ర‌బాబు చేసిన ప‌నేంటీ.. ఇంత‌లా ఊస‌ర‌వెల్లితో పోల్చి తిట్టాల్సినంత అవ‌స‌రం ఏమెచ్చింది అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి.


చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని రౌడీ నాయ‌కుడు అంటూ తిట్టిపోసేవారు. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా మారి, వైఎస్సార్ సీఎం కాగానే రౌడీ సీఎం అంటూ విమ‌ర్శించారు. ఇలా అధికారం ఉన్నా లేకున్నా వైఎస్సార్‌ను విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకునేవారు చంద్ర‌బాబు నాయుడు. కానీ ఇప్పుడు అదే వైఎస్సార్‌ను పొగుడుతూ అంద‌రిని ఆశ్చ‌ర్యం ప‌ర్చుతున్నాడు చంద్రాలు. తెగిన నోటితోనే పొగుడుతూ ఉన్నాడంటే ఆ వ్య‌క్తి ప‌చ్చి అవ‌కాశ‌వాది అనేది ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిన స‌త్యం. ఎందుకంటే అవ‌స‌రం అయితే పొగుడుతారు, లేకుంటే తిడుతారు. ఇది దూర్త ల‌క్ష‌ణం.


వైఎస్సార్ బ‌తికున్న‌ప్పుడు తిట్టి.. ఆయ‌న చిన‌పోయిన త‌రువాత ఆయ‌న కొడుకును తిట్టేందుకు తండ్రిని పొగుడుతున్నాడు చూడు చంద్ర‌బాబు నైజం మ‌రింత బ‌య‌ట‌ప‌డింద‌నే చెప్ప‌వ‌చ్చు.. ప్ర‌స్తుత సీఎం. దివంగ‌త మ‌హానేత కొడుకు వైఎస్ జ‌గ‌న్‌ను తిట్ట‌డం కోసం వైఎస్సార్‌ను పొగిడాడు బాబోరు... అంటే కొడుకును తిట్ట‌డం కోసం తండ్రిని వాడుకుంటున్నాడు అంటే చంద్ర‌బాబు చావు తెలివి క‌నిపిస్తుంది. చంద్ర‌బాబు వేస్తున్న ఈ చీఫ్ పాలిట్రిక్స్‌ను చూసి ఏపీ జ‌నం న‌వ్వుకుంటున్నారు. ఆయ‌న నైజం తెలిసి ఆయ‌న పార్టీ నేతలు, అనుచ‌రులు గ‌ప్‌చుఫ్ గా ఇత‌ర పార్టీలోకి జారుకుంటున్నారు.


అయినా బుద్ది రాని చంద్ర‌బాబు ఆత్మ‌స్తుతి.. ప‌ర‌నింద అనే చందంగా ముందుకు సాగుతున్నారు.. చంద్రాలుకు ఇంత వ‌యసొచ్చింది..  సీఎంగా 14ఏండ్ల అనుభ‌వం.. ప్ర‌తిప‌క్ష నేత‌గా 10ఏండ్ల‌కు మించిన అనుభ‌వం.. ఇంత అనుభ‌వం ఉంది.. కానీ ఏమీ లాభం.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియ‌దు.. ఎవ‌రిని పొగ‌డాలో ఎవ‌రిని తిట్టాలో తెలియ‌దు.. అందుకే అంటున్నారు.. ఆయ‌న స‌హాచ‌రులు బాబుకు వ‌య‌స్సు పెరిగింది కానీ బుద్ది మంద‌గించింది అని .. ఇక‌నైనా బాబోరు త‌న వైఖ‌రి మార్చుకోక‌పోతే ప్ర‌జ‌ల్లో మ‌రింత ప‌లుచ‌న కాక త‌ప్ప‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి: