మొదటి నుంచి కూడా భారత్ మెతక వైఖరి కారణంగా పాకిస్థాన్ ఎంతో మంది ఉగ్రవాదులను మన దేశం పైకి పంపించి అమాయకపు ప్రజలను బలి తీసుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మెతక వైఖరిని పక్కన పెట్టి .. చివరికి పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుబెడుతుంది. ఇప్పుడు తాజాగా పీఓకే లోకి వెళ్లి భారత్ సుమారు 57 మందిని హతమార్చింది. దీనితో పాక్ ఆత్మరక్షణలో పడింది. భారత్ ను ఎలా నిలువరించాలని సమావేశాలు మీద సమావేశాలు నిర్వహిస్తుంది. మరో పక్క పాక్ చేస్తున్న ఉగ్రవాద చేష్టలు .. అగ్రదేశమైన అమెరికాకు కూడా కోపం తెప్పించాయి. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఆపాలని అప్పుడే భారత్ తో చర్చలు సాధ్యమని చెప్పుకొచ్చాయి.


ఇప్పటికే పాకిస్థాన్ చర్యల పట్ల అనేక అగ్రదేశాలు భారత్ కు సపోర్ట్ గా వచ్చాయి. చివరికి చైనా కూడా మొన్న భారత్ టూర్ కు వచ్చినప్పుడు కాశ్మీర్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీని బట్టి చెప్పొచ్చు. భారత్ దౌత్యపరంగా .. పాక్ ను అంతర్జాతీయంగా ఒంటరి దానిని చేసిందని. కాంగ్రెస్ హయాంలో పాక్ ఆటలు కాశ్మీర్లో సాగుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కాశ్మీర్ కాదు కదా .. ఇప్పుడు తమ భూబాగంలో ఉన్న పీఓకేనే కాపాడుకోవాల్సిన పరిస్థితి.


భారత్ తో యుద్ధమే జరిగితే పాక్ ఓడిపోతుందని ప్రపంచదేశాలతో పాటు పాక్ కు కూడా తెలుసు. భారత్ నుంచి పీఓకేను కాపాడుకోవటం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ముందు ఉన్న పెద్ద సవాలు. కాశ్మీర్ గురించి పాక్ మాట్లాడినప్పుడల్లా భారత్ కేవలం మన అధీనంలో ఉన్న కాశ్మీర్ గురించి మాత్రమే చెప్పేది. అయితే భారత్ ఇప్పుడు తన పంథాను మార్చుకొని పీఓకే గురించి మాట్లాడుతూ ఎదురు దాడికి దిగుతుంది. ఒక దేశం అభివృద్ధిపధంలో ఉండాలంటే పొరుగు దేశాలు కూడా మంచివి అయి ఉండాలి. మన ఖర్మ ఏంటంటే మన పక్కన పాకిస్థాన్ ఉండటం .. దేశంలో ఉగ్రదాడులు జరిపి దేశాన్ని అస్థిర పరచాలని చాలా సార్లు ఉగ్రమూఖలను భారత గడ్డ మీదకు పంపించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: