సామాన్య మానవులు ఏ కూర లేకపోతే కనీసం ఉల్లిగడ్డ కారం దంచుకొని తినేవారు. కానీ ఆ ఉల్లిధర మాత్రము ఆకాశమును అంటుతుంది అని ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలు ఏ కూర వండిన ఉల్లిపాయలు వేస్తేనే రుచిగా ఉంటుంది అని అంటాము. కాని అలాంటి ఉల్లిపాయల ధరలు పెరిగి నందున మధ్య తరగతి ప్రజలు ఉల్లిపాయలను అరకొరగా కొనుగోలు చేసి కాలము వెళ్లబుచ్చుతున్నారు ఉన్నారు.


 ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా మరియు మహారాష్ట్ర లో ఉల్లిపాయల కొత్త పంట మార్కెట్లోకి వస్తే ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశించారు. కానీ వర్షాల కారణంగా ఉల్లిపాయల పంట దిగుబడి చాలా తగ్గడం వల్ల మార్కెట్లోకి ఆశించినంత ఉల్లి పంట రానందున ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వము రైతు బజార్లలో రాయితీ ధరకు విక్రయాలు ప్రారంభించింది. కానీ వారం రోజులు కూడా విక్రయ కేంద్రాలు సరిగా పనిచేయలేదు. దీనితో ప్రజలు చాలా నిరాశకు గురి అయ్యారు.


 ప్రస్తుతము నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లిపాయలు బహిరంగ మార్కెట్లో కిలో నలభై ఎనిమిది రూపాయలకు పైగా అమ్ముతున్నారు. అంతా ధర పెట్టి కొనాలి అంటే సామాన్య మానవులు చాలా భయపడుతున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ లో నాణ్యమైన ఉల్లిపాయలు క్వింటా నాలుగు వేలకు పైగా ధర పలుకుతున్నది.

అలాగే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉల్లిపాయలు క్వింటా మూడు వేల రూపాయలు ధర పలుకుతున్నది. మరియు మహారాష్ట్ర మరియు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలకు తీసుకొని రావడానికి ఆరు శాతం రుసుము మరియు కూలి చార్జీలు కలిపి పది రూపాయలు ఖర్చు ఎక్కువగా వస్తున్నది. మరియు మనవాళ్లు ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు అని ప్రతి కూరల్లోనూ ఉల్లిపాయ లేనిది వంట చేయరు. ఇలాగే ఉల్లి ధరలు పైకి వెళ్తే సామాన్య మానవులు చాల ఇబ్బందులకు గురి అవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: