బ్యాంక్ కస్టమర్లకు పరోక్షంగా ప్రయోజనం కలిగించే కీలక నిర్ణయాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. దీంతో కొంతవరకు బ్యాంకు కస్టమర్లకు లాభం చేకూరనుంది. అదేమంటే  సాధారణంగా డీఎస్ఏ ఏజెంట్లుగా ఉన్నవారు  రిటైల్ లోన్స్ విక్రయం, రుణ గ్రహీతల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ వంటి పనులు చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి పనుల నిమిత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ (డీఎస్ఏ)ను నియమించుకోవద్దని ఆర్‌బీఐ ఆదేశించింది.


వీరు తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న కారణం ఏంటంటే డీఎస్ఏ ఏజెంట్ల ద్వారా జరిగే డేటా థెఫ్ట్ (సమాచార తస్కరణ) కేసులను నియంత్రించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ చర్య ద్వారా నిర్వహణ సమస్యలు కూడా తగ్గుతాయని ఆర్‌బీఐ భావిస్తోంది. అయితే బ్యాంకులు మాత్రం ఆర్‌బీఐ నిర్ణయంతో భయ పడుతున్నాయని. ఈ నిర్ణయం వల్ల కన్సూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ జారీ తగ్గుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ సందర్భంగా ఈ అంశానికి సంబంధించి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఆర్‌బీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలని భావిస్తున్నాయట..


ఇకపోతే కేవైసీ ప్రక్రియలోని రుణ గ్రహీతల ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ను బ్యాంక్ అధికారులే నిర్వహించాలని, ఔట్‌సోర్సింగ్ వారు ఈ పని చేయకూడదని చెబుతోంది. ఎందుకనగా రుణ గ్రహీతల వివరాలు దుర్వినియోగం అయ్యాయనే సంఘటనలు పలుసార్లు ఆర్బీఐ దృష్టికి వచ్చి ఉండొచ్చు అని విశ్వాసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రస్తుతం పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు, కన్సూమర్ క్రెడిట్ వంటి రిటైల్ రుణాలు చాలా వరకు డీఎస్ఏ మార్గంలోనే వస్తుండటం వల్ల మోసాలు జరిగే అవకాశాలుండటం వల్ల,  బ్యాంకింగ్ పరిశ్రమ నిపుణుల సూచనల మేరకు ఆర్‌బీఐ ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తుందని అనుకుంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: