హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే రోజున  టీఆర్ఎస్ అభ్యర్థి…. శానంపూడి సైదిరెడ్డి పోలింగ్ బూత్ దగ్గర ఓవర్ యాక్షన్ చేశారన్న విషయం తెలిసిందే. ఇంతేకాకుండా నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసులకే ఉల్టా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక జరిగిన విషయం ఏంటంటే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు పోలింగ్ బూత్ సందర్శనకు వెళ్లిన శానంపూడి సైదిరెడ్డి, లోకల్ లీడర్లతో పోలింగ్ బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా… అక్కడే ఉన్న ఎస్సై రాఘవేందర్ రెడ్డి అనుమతించలేదు.


దీంతో ఆగ్రహించిన సైదిరెడ్డి  ఓవర్ యాక్షన్ వద్దు.. ఎక్కువ తక్కువ మాట్లాడకు.. ఏం నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్ తగ్గు కొద్దిగా తగ్గూ.. అంటూ ఎస్సైతో ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి ఘాటుగా మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు.. ఇక ఈ సంఘటనపై స్పందించిన పలువురు ఆ సందర్భంలో తీసిన వీడియోను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేయగా సైదిరెడ్డి పై కేసు నమోదైంది.


ఇకపోతే అధికార పార్టీ అభ్యర్థి కావడంతో, అధికారం తమచేతుల్లోనే ఉందనే అహంకారంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్సై పట్ల సైదిరెడ్డి దౌర్జన్యం చేశారని.. ఇది సమర్థనీయం కాదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అతను అలా ప్రవర్తించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి..ఒక సాధారణ స్దాయి అభ్యర్ది ప్రవర్తన ఎంతగా అహంకార పూరితంగా ఉందో టీఆర్ఎస్ పెద్దలు గమనించగలరు. ఇలాంటివారా రాజకీయాల్లో ఉండేది అనే ఆలోచనా ప్రతివారిలో ఈ సందర్భంగా కలుగుతుందని అంటున్నారు. ఇకపోతే విధినిర్వహణలో ఉన్న ఎస్సై రాఘవేందర్ రెడ్డి విధులకు అడ్డంకి కలిగించడం సరైన పద్దతికాదని, పలువురు ఆరోపించిన నేపద్యంలో సైదిరెడ్డిపై 356, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: