హిందూ సమాజ్‌ పార్టీ నాయకుడు కమలేష్‌ తివారీ గత  శుక్రవారం దారుణ హత్యకు గురి అయిన సంగతి అందరికి తెలిసిందే.నగరంలోని  ఖుర్షిద్‌ బాగ్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. కమలేష్‌ గతంలో హిందూ మహాసభలో పనిచేశారు. అనంతరం బయటికి వచ్చి హిందూ సమాజ్‌ పార్టీని స్థాపించారుపోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం,ఆఫీసులో కూర్చున్న కమలేష్‌ వద్దకి టీ ఇచ్చే నెపంతో లోపలికి ప్రవేశించి దుండగులు పదునైన ఆయుధాలతో  అతని గొంతుకోసి పరారు అయ్యారు. అనంతరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న కమలేష్‌ తివారీని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

ఘటనా స్థలంలో ఒక నాటు తుపాకి, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన  వైద్య  సిబ్బంది,ఆ రిపోర్టును బుధవారం బయట పెట్టారు. రిపోర్టులోని వివరాలు ఇలా తెలిపారు.దుండగులు కమలేష్‌ను దవడ నుంచి ఛాతీ వరకు 15 సార్లు కత్తితో అతి  దారుణంగా పొడిచారు.

రెండు సార్లు గొంతు కోయడానికి కూడా  ప్రయత్నించారు. కమలేష్‌ కుప్పకూలిపోయాక కూడా చనిపోయారో  లేదో అన్న అనుమానంతో తుపాకీతో ముఖంపై కాల్చారు. ఈ మేరకు కమలేష్‌ తలలో పాయింట్‌ 32 బుల్లెట్‌ను డాక్టర్లు వెలికి తీశారు పోస్ట్ పోస్టు మార్టం ప్రకారం.

మరోవైపు నిందితుల కోసం గాలించిన పోలీసులు గుజరాత్‌ - రాజస్థాన్‌ సరిహద్దుల్లో ఇప్పటికే  ఇద్దరిని పట్టుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్న గుజరాత్‌ యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌  బృందం వారిని సూరత్‌కు చెందిన అష్ఫాక్‌ షేక్‌, మొయినుద్దీన్‌ పఠాన్‌గా గుర్తించారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు అప్పగించింది. మరో నిందితుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ప్రస్తుతం.


మరింత సమాచారం తెలుసుకోండి: