రాష్ట్రంలో చిర‌స్థాయిగా పేరు నిలిచిపోవాల‌ని ఏ ముఖ్య‌మంత్రి అయినా, ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌య‌త్నిస్తుం ది. దీనికి ఆ పార్టీ, ఈ పార్టీ అనే ప్ర‌త్యేక‌త ఏమీ ఉండ‌దు. ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. కుదిరిన‌న్ని సం వత్సాలు.. అధికారంలో ఉండాల‌ని, కుదిరినంత మేర‌కు చ‌రిత్ర సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తాయి. ఇలా 2004లో ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా రాష్ట్రంపై త‌న‌దైన ముద్ర వేశారు. ఆరో గ్య శ్రీ, 108 వంటికీల‌క నిర్ణ‌యాలు తీసుకుని.. ప్ర‌జ‌ల్లో చిర‌స్థాయిగా నిల‌బ‌డిపోయారు. అందుకే ఆయ‌న మ‌ర‌ణిస్తే.. వ్య‌క్తులు కాదు.. రాష్ట్ర‌మే శోక‌సంద్రంలో మునిగిపోయింది.


మ‌రి ఇంత‌టి రేంజ్‌లో ఎవ‌రైనా ప్ర‌జ‌ల గుండెల్లో చోటు సంపాయించుకున్నారా? అనేది ప్ర‌శ్న‌గానే నిలిచి పోయింది. ఆ త‌ర్వాత ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ రేంజ్‌లో కాదుకానీ, ఏదో అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌పంచ‌స్తాయిలో నిర్మిస్తే.. త‌న‌పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్మోగుతుంద‌నే అనుకున్నారు. కానీ, ఆయ‌న మాట‌ల‌వ‌ర‌కే ప‌రిమిత‌మై.. త‌న ఆలోచ‌న‌ల‌కు రాజ‌కీయాలను జోడించారు. ఫ‌లితంగా ప్ర‌య‌త్నం అక్క‌డే నిలిచిపోయింది. అమ‌రావ‌తి అక్క‌డే ఆగిపోయింది. ఈ రేంజ్‌లో ఆయ‌న ఇంత‌కు మించి దూకుడు చూపించ‌లేక పోయారు.


ఎన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా.. బాబు రేంజ్‌ను అందుకోలేక పోయారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ విష‌యానికి వ‌ద్దాం.. ఆయన అధికారంలోకి వ‌చ్చిన ఐదు మాసాల్లోనే ఓ మాత్రం రేంజ్‌ను అందుకున్నా రు. ల‌క్ష‌ల సంఖ్య‌లో కొత్త ఉద్యోగాల‌ను సృష్టించారు. ఇది దేశంలోనే ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం. అదేస‌మ యంలో మ‌ద్య నిషేధ రాష్ట్రంగా తీర్చిదిద్దాల‌నేది కూడా ఆలోచ‌నాత్మ‌క కార్య‌క్ర‌మం. అయితే, ఈ రెండు కూడా జ‌గ‌న్‌ను చిర‌స్థాయిగా వైఎస్ మాదిరిగా ప్ర‌జ‌ల్లో గుడి క‌ట్టుకునేలా చేస్తాయా? అంటే ..సందేహ‌మే! కొంత బాధ‌గా అనిపించినా.. ఇది నిజం.


ఏదో ల‌బ్ధిపొందిన ఉద్యోగులు ఆయ‌న‌ను త‌లుచుకోవ‌చ్చు. కానీ, విశాల రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్ర‌జ‌లు ఆయ‌న‌ను గుర్తు పెట్టుకుంటార‌ని మాత్రం ఈ రెండు కార్య‌క్ర‌మాల ద్వారా చెప్ప‌లేం. కానీ, పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన హామీల్లో కీల‌క‌మైన రెండు కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయ‌డం ద్వారా మాత్రం జ‌గ‌న్‌.. చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని, ఆయ‌న పేరు ప్ర‌తి వాడి గుండెల్లోనూ ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అవే.. ఒక‌టి కొత్త జిల్లాల ఏర్పాటు. రాష్ట్రంలోని ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లా కింద మారుస్తాన‌ని, ఆయా జిల్లాల కు అక్క‌డి ప్రాధాన్య వ్య‌క్తుల పేర్లు పెడ‌తామ‌ని జ‌గ‌న్ అన్నారు.,


ఇది సాకారం అయితే, అల్లూరి జిల్లా స‌హా ఎన్టీఆర్ వంటి కీల‌క నేత‌ల పేర్ల‌తో జిల్లాలు ఏర్ప‌డుతాయి. అదేస‌మ‌యంలో మ‌రో కీల‌క హామీ.. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌., అంటే.. ప్ర‌తి జిల్లాలోనూ ప్ర‌భుత్వానికి సంబంధించిన యాక్టివిటీ జ‌రిగేలా.. చ‌ర్య‌లు తీసుకోవ‌డం, కీల‌క‌మైన ప్రాజెక్టులు ప్ర‌తిజిల్లాలోనూ ఏర్పాటు చేయ‌డం వంటివి చేయ‌డం ద్వారా జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతార‌న‌డంలో సందేహం లేదు. పోనీ.. ఇది కాకున్నా.. పేద‌ల‌కు ప‌క్కాఇళ్ల కేటాయింపు, ఇళ్ల స్థ‌లాల కేటాయింపు కూడా ఆయ‌న‌కు మ‌రో ఆరోగ్య శ్రీమాదిరిగా పేరు తెచ్చిపెడుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో చంద్ర‌బాబు..ను మించిపోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: