ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం చేసి ఐదు నెలలు కావొస్తుంది. తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టిన, ఏ మాత్రం తడబాటు లేకుండా అద్భుతమైన పాలన కొనసాగిస్తున్నారు. ఈ ఐదు నెలల్లోనే అన్నీ వర్గాల ప్రజలని ఆదుకునేలా పథకాలు రూపొందించిన నవరత్నాలని అందించారు. అటు నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు కల్పించి, వారికి పెద్దన్నగా నిలిచారు. అయితే వీటి అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయంలో జగన్ చూపించిన చొరవ సూపర్ అనే చెప్పాలి. ప్రజలకు సంక్షేమం, ఉద్యోగాలు కంటే అతి ముఖ్యమైనది చదువు. ప్రతి ఒక్కరికి విద్య ఉండాలనే ఉద్దేశంతో, నిరక్షరాస్యతని తగ్గించడం కోసం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు.


అలాగే విద్యార్ధుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొదట దివంగత వైఎస్సార్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంటుని వందశాతం అమలు చేయడానికి సిద్ధమయ్యారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి పేదవాడి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే పెట్టుకొనుంది. అలాగే దశలవారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్, టాయ్‌లెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, పెయింట్లు వేయించటం వంటి చర్యలతో పాఠశాలలన్నింటి రూపురేఖల్ని మార్చేందుకు బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయింపు చేశారు.


రెండేళ్లలో పాఠశాలల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా నవంబర్ 14 నుంచి మన బడి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే జనవరి 26 నుంచి పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15,000 ఇవ్వనున్నారు. ఇంటర్‌ వరకూ పథకం వర్తింపు చేయనున్నారు. ఇక ఇంటర్‌ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇవ్వనున్నారు. అదేవిధంగా చదువు దశ నుంచే ఉద్యోగాలకు ఉపయోగపడేలా  ప్రణాళికను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.


అలాగే తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరిగా ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయనున్నారు. ఇక విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శనివారం నో బ్యాగ్‌ డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ఇంజినీరింగ్ కాలేజీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. కేవలం ఈ ఐదు నెలల్లోనే జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇవి. భవిష్యత్ లో కూడా విద్య విషయంలో మరిన్ని నిర్ణయాలు తీసుకొనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: