మన దేశంలోనే ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఊహించని విషయం చోటు చేసుకుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలను నిర్దేశించే ఈ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నీ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోందని పేర్కొనగా మహారాష్ట్రలోని సతారా లోక్ సభ నియోజకవర్గంలో సోమవారం చోటుచేసుకున్న ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. 

సతారా ఎంపీ ఉదయన్ రంజీ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలోకి చేరారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీ తోపాటుగా సతారా లోక్ సభ ఉప ఎన్నిక జరిగింది. అయితే ఆ గ్రామంలో ఎవరికి ఓటు వేసినా ఆ ఓటు బిజెపి కే పడిందని ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో ఓటర్ల నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది. ఎవరికి ఓటు వేసినా బీజేపీ ఎన్నికల గుర్తు కమలం వద్ద లైట్ వెలుగుతుంది అని వారు చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించిన అధికారులు కూడా ఈవీఎం మెషిన్ లో ఏదో లోపం ఉందని అంగీకరించారట.

ఈ విషయమై శశికాంత్ షిండే మీడియాతో మాట్లాడుతూ సతారా పరిధిలోని నావ్లేవాది గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన లో గ్రామంలో ఓటర్లు ఎవరికి ఓటు వేసినా బీజేపీ కే పడిందని... గ్రామస్తులు విషయాన్ని అతని దృష్టికి తీసుకువచ్చారనితను వెళ్లి అధికారులతో మాట్లాడగా అప్పటికప్పుడు వారు ఈవీయం మెషీన్ ను మార్చారు అని తెలిపారు. కానీ అప్పటికే దాదాపు 293 ఓట్లు బిజెపికి పడ్డాయట. పోలింగ్ అధికారిని కీర్తి నలవాడే కూడా దీనిపై స్పందిస్తూ మెషిన్ బటన్ లో సమస్య ఉందని వెంటనే తాము ఈవీయంని మార్చేశాం అని తెలిపారు. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించే సమయంలో పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తి లేదని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి ఘటనల వల్ల ప్రజలకు ఎన్నికల కమిషన్ మరియు ఈవీఎం లపై ఉన్న విశ్వసనీయతను కచ్చితంగా దెబ్బతీస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: