ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ ఎలాగో పాఠాలు నేర్చుకోలేదని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ ఉన్న టీడీపీ అధినేత మాత్రం గుడ్డెద్దు చేలో పడ్డట్టు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏవైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ప్రజలు ఆలోచిస్తారు. అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారు. ఇక ఈ విషయంలో చంద్రబాబుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.


మొన్న ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటే గెలుచుకుంది. ఆఖరికి పవన్ పోటీ చేసిన రెండు చోట ఓటమి పాలయ్యారు. సరే గెలుపోటములు సహజమే అని పవన్ ఏమన్నా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారా అంటే అది లేదు. పార్టీ పెట్టి ఐదేళ్లు దాటిన పవన్ ఇప్పటికీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ లాగానే నడుస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు నెలలు అవుతుంది. ఈ సమయంలో పార్టీని మంచిగానే బలోపేతం చేసుకోవచ్చు.


కానీ పవన్ మాత్రం అప్పుడప్పుడు సమావేశాలు పెట్టడం, ఎప్పటిలాగానే వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, మళ్ళీ అడ్రెస్ లేకుండా వెళ్లిపోవడం. పైగా సమావేశాల్లో తాను ఎన్నికల్లో ఓడిపోయిన వెనక్కి తగ్గనని, గెలిచినా, ఓడినా చివరి వరకు పార్టీని నడుపుతానని రెండు మూడు డైలాగులు వేసేస్తారు. గెలుపే లక్ష్యం అనుకుంటే వేల వ్యూహాలు రచించేవాడినని అంటూ గొప్పలు చెప్పేస్తారు.


తాజాగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కూడా ఇవే డైలాగులు కొట్టి కార్యకర్తలని ఉత్సాహ పరిచే కార్యక్రమం చేశారు. బోనస్ గా జగన్ పై విమర్శలు. వాటి వల్ల పార్టీకి ఏ విధమైన ఉపయోగం కూడా ఉండదు. మరోవైపు నేతలు జంప్ అయిపోతున్న అవేమీ పట్టనట్లు కనిపిస్తారు. పవన్ ఇలాగే కంటిన్యూ చేస్తే...జనసేన అడ్రెస్ గల్లంతు అవ్వడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: