అభివృద్ధి, సంక్షేమం చూసి తెలుగుదేశం పార్టీ నేతలు ఓర్వలేనంత పాలన ఏం చేశారో చెప్పగల ధైర్యం వైసీపీ మంత్రులకు ఉందా.? ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకం నుంచి.. నిన్నటికి నిన్న కేబినెట్‌తో తీసుకున్న మీడియాపై ఆంక్షల వరకు ప్రతీ నిర్ణయం ప్రజా వంచన, ప్రజావ్యతిరేకం. అప్రజస్వామికం. అలాంటి మీ పాలన చూసి మేం అసూయ పడుతున్నామా.? ఏం ఒరగబెట్టారని ఈర్శ్చపడడానికి.? నాలుగు నెలల పాలనపై చర్చించేందుకు ఏ మంత్రి అయినా సిద్ధంగా ఉన్నారా.? కనీసం రాష్ట్రంలోని సమస్యల గురించి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన గురించిన వివరాలను అయినా బహిర్గతం చేసే ధైర్యం మంత్రులకు ఉందా.? అసలు మీరు ఏం చేశారని చెప్పుకోవడానికి.?  అని తెలుగు దేశం పార్టీ నేత అనగాని సత్య ప్రసాద్ ప్రశ్నించారు.  


చంద్రబాబు గారి పాలనలో అమరావతి అడుగులు నేర్చుకుంది. అన్న క్యాంటీన్లు బడుగుల ఆకలి తీర్చాయి. రూ.200 నుంచి రూ.2000లకు పెంచిన పెన్షన్లు వృద్ధులకు ఆసరాగా నిలిచాయి. కానీ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో అడుగులేస్తున్న అమరావతి ఆగిపోయింది. అన్నార్తుల ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. కూలీలు కూటి కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇది చూశా మేం అసూయపడాలి.? ఇది చూశా మేం ఓర్వలేకపోతున్నాం..? జగన్‌ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులు చూసి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేక మొహం తిప్పుకుని తిరుగుతున్నారు. లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులో కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వ్యక్తి వెనకున్న మంత్రులకు.. లక్షల కోట్ల సంపద సృష్టించి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా తలెత్తుకునేలా చేసిన చంద్రబాబు గారిపై విమర్శలు అర్హత హక్కు ఉందా.?  చంద్రబాబు గారి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏంటో చెప్పడానికి  అనతికాలంలోనే ప్రపంచ ఖ్యాతిగాంచిన అమరావతి ఉంది. 


కానీ ఏ రోజు ఏమవుతుందో తెలియక దినదిన గండంలా రోజులు గడుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో క్విడ్‌ ప్రో కో తప్ప ఏమున్నది.? మీ నాలుగు నెలల రివర్స్‌ పాలన చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారు. వైసీపీ అనైతిక చర్యలను చూసి గ్రామాల్లో మీకు నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీ కార్యాలయాలకు టూలెట్‌ బోర్డులు పెట్టడం ఖాయం. వైసీపీ పునాదులు కదులుతున్నాయనే విషయాన్ని  గ్రహించి మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోకుంటే ప్రజలు తరిమికొట్టడం ఖాయమని గుర్తుంచుకోండి అంటూ అనగాని ప్రసాద్ మండి పడ్డాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: