ఈ మధ్య శ్రీమంతుడు అనే మాటను వింటుంటే మనకు మహేష్ బాబు గుర్తొస్తున్నారు.. సినిమాలో ఊరును దత్తత తీసుకోవడం., ఉన్న ఆస్తులు వదులుకొని ఊరుని అభివృద్ధి చేయడం వంటి ఆలోచన ఉన్న శ్రీమంతుడు గా మహేష్ గుర్తుండి పోయాడు.. అయితే ఇది మనం సినిమాలో చూశాం.. కానీ ఇప్పుడు నిజ జీవితంలో నిజమైన శ్రీమంతుడు ఒకరు మీడియా దృష్టిలో పడటం కాస్త ఆశ్చర్యం.. అయితే అతను ఎవరో కాదు విప్రో కంపెనీ వ్యవస్థాపకుడు "అజీమ్ ప్రేమ్ జీ".

1920లో గాంధీ ప్రారంభించిన గుజరాత్‌ విద్యాపీఠ్‌ 66 ఏళ్ళు కావడంతో అక్కడి  విద్యార్థులనుద్దేశించి ప్రేమ్ జీ మాట్లాడుతూ ‘శ్రీమంతులు తమ సంపదకు ట్రస్టీలుగా ఉంటూ, ప్రజలకు మేలు చేసేందుకు ఉపకరించాలన్న గాంధీ ఆలోచనే, తన మదిలో నిరంతరం పరిభ్రమించేద’ని తెలిపారు. సంపదను ఎలా వినియోగించాలి అనే అంశంపై తన ఆలోచనలు, తన చర్యలను తన తల్లి తరవాత అంతగా ప్రేరేపించింది మహాత్మాగాంధీ మాటలే అని ప్రేమ్‌జీ వివరించారు. దేశీయ అగ్రశ్రేణి కుబేరుల్లో ఒకరైన ప్రేమ్‌జీ తన సంపదలో అధికభాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించే విషయం అందరికీ తెలిసిందే. ‘ప్రేరణ కలిగించే వాటిల్లో మహాత్ముని జీవితమే అత్యంత గొప్పదని ప్రతీ భారతీయ వ్యక్తి తెలుసుకోవాలి..

ఇతర ఆర్థిక పరమైన భావజాలానికి భిన్నంగా, ట్రస్టీషిప్‌ అనే పదాన్ని ఉపయోగించి అందరూ కలిసి పనిచేసే వీలు కలుగుతుంది. ప్రపంచంలో అసమానతలు, అన్యాయం ఎక్కువైతే, కష్టాలు, బాధలు, అవమానాలు పెరగడం సాధారణ విషయం.. కానీ ఇటువంటి పరిస్థితులను సజావుగా మార్చేందుకు సంపదను, ఇతర వనరులను ఉపయోగించాలన్నదే మహాత్ముడి ధ్యేయం’ అంటూ విద్యాలయం స్థాపించి 66 సంవత్సరాలు ముగిసిన ఆనందం లో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీ తెలిపారు.. గాంధీ ఎంత గొప్పవాడో తెలీదు కానీ.!! గాంధీ ఆలోచనలు మాత్రం చాలా గొప్పవి అని ఈ సందర్భంగా ప్రేమ్ జీ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: