ఏపీలో బలపడదామనుకుంటోంది. దానికి తగిన ప్రణాళికలను ఈసారి సరిగ్గానే వేసుకుంటోంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, చాణ్యక్యుడికే తలదన్నే నరేంద్ర మోడీ, అమిత్ షా. వారి వ్యూహాలు ఎవరికీ అంతుబట్టవు, వారి వ్యవహారాలు కూడా వూహాకు అందవు. ఇకపోతే అవసరార్ధం స్నేహం చేయడం, లేకపోతే వారిని పక్కన పెట్టడం ప్రస్తుత‌ బీజేపీకి అలవాటైన విద్య. ఎన్నికల్లో పొత్తులకు ఒక లెక్క ఉంటుంది. ఇక ఏపీలో విస్తరించడానికి బీజేపీ మాస్టర్ ప్లాన్ సిధ్ధంగా చేసి ఉంచింది.


అదేంటి అంటే ఈసారి ఏపీలో బీజేపీ టార్గెట్ వింటే ఆశ్చర్యం వేస్తుంది కానీ అది నిజం. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ప్రధాన శత్రువు congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ కాదు, టీడీపీయేనట. టీడీపీకి బీజేపీకి చాలా దగ్గర  పోలికలు ఉన్నాయి. రెండు పార్టీలు ప్రధానమైన కమ్మ సామాజికవర్గాన్ని పునాదిగా ఎదురుగుతున్నవే. ఇక ఏపీలో టీడీపీకి ఉన్న బలమంతా కోస్తాలో బలమైన కమ్మలదే. దాన్ని కనుక పట్టుకుంటే బీజేపీ ఎదుగుదల సాధ్యపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది.వైసీపీ ఓటు బ్యాంక్ కి బీజేపీ భావజాలానికి కూడా చాలా తేడా  ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటింగ్ బ్యాంక్ వైసీపీది. ఆ భావజాలం ఉన్న వారు బీజేపీ వైపు మొగ్గరు. ఇక టీడీపీ వైపు ఉన్న వారు యాంటీ కాంగ్రెస్. అందువల్ల వాళ్ళను కనుక తమ వైపు తిప్పుకుంటే ఏపీలో పాగా వేయడం సులువు అవుతుందని బీజేపీ భావిస్తోంది.


అందువల్ల్ల టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో బతకనీయకూడదన్నది  బీజేపీ తాజా ప్లాన్ గా ఉంది. ఆ విధంగా కనుక చేస్తేనే ఆ ఓటు బ్యాంక్ అంతా గతి లేక బీజేపీ వైపు వస్తుందని, అపుడే ఏపీలో గెలవగలమని బీజేపీ వ్యూహంగా ఉందిట. దీంతో ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి పాజిటివ్ గా ఒక్క మాట కూడా అనరాదన్నది బీజేపీ ఆలోచన. తన పార్టీ క్యాడర్ కి కూడా ఇవే రకమైన సంకేతాలను పంపుతోందట. మరి అదే కనుక జరిగితే ఏపీలొ టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకమే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: