ఒకప్పుడు ఇండియా బలహీన దేశం.. ఆ తరువాత అభివృద్ధి చెందుతూ వచ్చింది.  ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడింది. చాలామంది అంటూ ఉంటారు... చిన్నప్పటి నుంచి చూస్తున్నాం.. ఇండియా డెవలపింగ్ కంట్రీ అని... ఎప్పుడు ఇదే మాటా చెప్తున్నారు.. ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా చూస్తాము అని.. మోడీ ప్రధాని అయ్యాక.. అందరు అర్ధం చేసుకునేలా గట్టిగా సమాధానం ఇచ్చారు.  ప్రస్తుతం ఇండియా అభివృద్ధి చెందిన దేశం.  ఆయా దేశాల సరసన నిలిచేందుకు మరెంతో సమయం పట్టదు అని స్పష్టంగా చెప్పారు.  


గతంలో చూసుకుంటే.. ఇండియా ఇతర దేశాల గురించి గట్టిగా మాట్లాడడానికి, గట్టిగా విమర్శలు చేయడానికి.. ఆయా దేశాలపై ఆంక్షలు విధించడానికి చాలా భయపడిపోయేది.  కారణం, రాజకీయాలు. ఎస్.. ఇండియాలో సంకీర్ణ ప్రభుత్వాల కారణంగానే ఇండియా బలహీనంగా ఉన్నది.  రాజకీయ లబ్ది కోసమే ఇండియాను వెనకబడే విధంగా చేశారు.  కేంద్రంలో బలమైన నాయకత్వం ఉంది.  దేశం ఒకరివైపు మొగ్గు చూపితే.. తప్పకుండా దేశంలో మార్పులు వస్తాయి అనడానికి ఇప్పుడు ఇండియానే ఒక ఉదాహరణ.  


ఇండియా తీసుకుంటున్న వేగవంతమైన, సాహసవంతమైన నిర్ణయాలే దేశాన్ని, ప్రజలను ముందుకు నడిపిస్తున్నాయి.  కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. కాశ్మీర్ విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన మలేషియాపై ఇప్పటికే ఇండియా అనేక చర్యలు తీసుకుంది.  మలేషియా నుంచి ఇండియా అత్యధిక కూరనూనెను దిగుమతి చేసుకుంటుంది.  ఇది సాలీనా సంవత్సరానికి 5 నుంచి 6 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.  ఇండియా తీసుకున్న నిర్ణయంతో అక్కడి నుంచి వచ్చే దిగుమతి ఆగిపోయింది.  ఇది ఆ దేశ ఆర్ధిక పరిస్థితిపై బలమైన ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  తాజగా పాక్ కు సపోర్ట్ చేసిన చైనా మీదకూడా ఇండియా ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకోబోతున్నది.  చైనా క్రాకర్స్ పై నిషేధం విధించింది.  చైనా క్రాకర్స్ ను ఇండియాలో వాడినట్టు తెలిస్తే.. దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  


ఇప్పుడు టర్కీ దేశంపై కూడా ఇండియా చర్యలు తీసుకుంటోంది.  టర్కీ దేశానికీ వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువభాగం ఇండియా నుంచే ఉంటారు.  టర్కీలో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు.  ఎప్పుడైతే కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.కాశ్మీర్ విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా టర్కీ మాట్లాడిందో అప్పటి నుంచే ఇండియా టర్కీపై కోపంగా ఉన్నది.  ప్రధాని మోడీ టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు.  దీని వలన రెండు దేశాల మధ్య జరగాల్సిన ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యాయి.  అదే విధంగా టర్కీ పర్యటించే పర్యాటకుల విషయంలో ఇండియా ఆదేశాలు జారీ చేసింది.  టర్కీ వెళ్లే పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతో ఇండియా నుంచి టర్కీ వెళ్లే పర్యాటకులు ఆలోచనలో పడ్డారు.  గతేడాది 1,47,217మంది ఇండియా పర్యాటకులు టర్కీని సందర్శించారు.  ఈ ఏడాది ఆ సంఖ్య తగ్గిపోయింది.  ఇప్పుడు ఇండియా హెచ్చరికతో ఈ సంఖ్య మరింత తగ్గుతుంది.  ఇది ఆ దేశంపై ప్రభావం చూసే అవకాశం ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: