ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాం.. పెట్టుబడుల్లో మనమే నెంబర్ వన్.. వాణిజ్యంలో మనమే నెంబర్ వన్.. డబల్ డిజిట్ గ్రోత్ ఉన్న ఏకైక రాష్ట్రం.. ఇవీ గత ఐదేళ్లూ చంద్రబాబు సర్కారు చెప్పిన మాటలు.. ఇప్పుడు వాటిలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నారు వైసీపీ నేతలు. ప్రత్యేకించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి లెక్కలతో సహా చంద్రబాబు పాలనలోని అవకతవకలను వివరిస్తున్నారు.


చంద్రబాబు, యనమల మాట్లాడే మాటల్లో ఒక్కటీ వాస్తవం లేదని, బాధ్యత గల స్థానంలో ఉన్న వారు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ర్యాంకు రావడమే మొదటిసారి అయితే పడడం, పెరగడం ఎలా సాధ్యమవుతుందో యనమల రామకృష్ణుడు చెప్పాలన్నారు. అతిదరిద్రమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా ఇచ్చి వెళ్లారని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.


40 సంవత్సరాల ఇండస్ట్రీ, అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు, యనమల రామకృష్ణుడు కొంచెం స్టడీ చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చురకంటించారు. ‘ఇటీవల ఇండియా ఇనోవేషన్‌ ఇండెక్స్‌ అంటే దేశంలో కొత్తధనం, వినూత్నత గురించి నీతి అయోగ్‌ వారు సర్వే చేశారు. ఆ రిపోర్టు ఆధారంగా యనమల ఏదేదో మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ నిర్వాకం వల్లే 10వ ర్యాంకు, తెలుగుదేశం హయాంలోనే ముందున్నామని మాట్లాడాడు.


చంద్రబాబు శ్రీకాకుళం వెళ్లి టీడీపీ అన్నా క్యాంటీన్లు నడిపితే.. వైయస్‌ఆర్‌ సీపీ మద్యం షాపులు నడుపుతుందని, తోక జాడిస్తే కత్తిరిస్తా. శ్రేణుల కోసం ప్రాణాలిస్తా.. మళ్లీ నేనే రావాలని కోరుకుంటున్నారంటూ మాట్లాడుతున్నాడు. అతిదరిద్రమైన ఆర్థిక పరిస్థితి వారసత్వంగా వచ్చినా.. ఇచ్చిన మాట ప్రకారం రూ. వెయ్యి పెన్షన్‌.. రూ.2250 ఇచ్చిన మాట వాస్తవమా కాదా..? లేదా చెప్పినదానికంటే సంవత్సరం ముందే వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్నాం. దాన్ని చూసి బాధపడుతున్నారా..? మొట్టమొదటి సారిగా రైతులకు ఇన్సూరెన్స్‌ బీమా వారు కట్టాల్సిన భాగం కూడా ప్రభుత్వమే కడుతుంది. దీన్ని చూసి బాధపడుతున్నారా..? లేదా సున్నా వడ్డీకి రైతులకు అప్పులు ఇవ్వాలని ప్రభుత్వమే ఆ భారం భరిస్తుంటే ప్రజలు బాధపడుతున్నట్లా..? దేనికి ప్రజలు బాధ పడుతున్నారో చంద్రబాబు, యనమల చెప్పాలి అంటూ కడిగిపారేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: