ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వ పాలనపై విమర్శలు సంధించాలి... ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించేలా కాపలా బాధ్యత నిర్వహించాలి..ఎక్కడ తేడా వచ్చినా నిలదీయాలి.. ఇదీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేయాల్సిన పని.. కానీ ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఆ పని చేయడం మాని అబద్దాలు చెబుతూ ప్రభుత్వంపై బురద జల్లుతోందని వైసీపీ విమర్శిస్తోంది.


ఇటీవల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ సీఎం చంద్రబాబు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందని విమర్శిస్తున్నారు. ఇందుకు వారు కొన్ని రిపోర్టులు చూపించారు. అయితే వారు చెప్పిందంతా అబద్దం అంటున్నారు వైసీపీ మంత్రులు. ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2019 ర్యాంకులో ఏపీ పడిపోయిందని యనమల విమర్శించారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. ఏపీ పదో స్థానానికి దిగజారిందని యనమల మాట్లాడుతున్నాడు. ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2019 నీతిఅయోగ్‌ చేసిన సర్వే. ఈ సర్వేలో కొత్తధనం, వినూత్నత, చదువు, కాలేజీ స్థాయి నుంచి వ్యాపారం, పరిశ్రమ స్థాయి వరకు దేశంలో ఏ రాష్ట్రం ఎలా ఉందని పోలికతో సర్వే చేశారు. రాష్ట్రంలో కొత్తధనం వచ్చే పరిస్థితులు ఉన్నాయా.. వచ్చినవి అమలు అవుతున్నాయా లేదా అని సర్వే సారాంశం.


ఏపీ పదో ర్యాంకుకు వచ్చిందని మాట్లాడుతున్నాడు. మొదటిసారి వచ్చిన ర్యాంకు ఎలా పడిపోతుంది. పడడం ఎక్కడ నుంచి పెరగడం ఎక్కడ నుంచి వస్తుంది.. అంటూ వివరణ ఇచ్చారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.ఏపీ స్కోర్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీలు, విద్యార్థుల చదువు బాగుంది. టీచర్లు, విద్యార్థులకు రేషియోలో బాగున్నాం. ఉన్నత విద్యలో బాగున్నాం. పీహెచ్‌డీ ప్రోగ్రాంలో తక్కువ ఉన్నాం. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో తక్కువగా ఉన్నామని రిపోర్టు ఇచ్చారు. ఇవన్నీ మూడు నెలల్లో చేసేవా..?


ఏడు ఇండికేటర్లు, 30 సబ్‌ ఇండికేటర్లలో ఒక్కటి కూడా మూడు నెలల్లో చేసేవి లేవు. చంద్రబాబు వైజాగ్‌లో సమ్మిట్‌లో కోట్లాది రూపాయల పెట్టుబడులు, కోట్లాది ఉద్యోగాలు వచ్చాయని దేశంలో జనాభా కంటే ఎక్కువ సంఖ్య చెప్పారు. ఐదేళ్లు పాలించని ప్రభుత్వం ఏం చేయలేదనేది. నీతి అయోగ్‌ రిపోర్టు నిదర్శనం. దీనికి చంద్రబాబు, యనమల రామకృష్ణుడు పూర్తిగా బాధ్యులు.. అని తేల్చారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: