ఒకవైపు ఆర్టీసీ సమ్మెతో ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులు, మరో వైపు వ్యాధులతో అల్లాడుతున్న ప్రజానీకం. తెలంగాణాలో పాలన పడకేసిందా అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కష్టాలు పట్టించుకునే నాధుడే లేడా అని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని వేరుచేసిన తర్వాత సామాన్య మానవుల జీవితాలు బాగుపడటం అనే మాట అటుంచితే ఎవరు ఎక్కువగా బాగుపడుతున్నారో సృష్టంగా కనిపిస్తుందని ప్రతిపక్షం ఓ వైపు దుమ్మెత్తిపోస్తుంది. ఈ దశలో బంగారు తెలంగాణ బరువైన తెలంగాణగా మారుతుందని కొందరు ఆవేదన చెందుతున్నారు.


ఇప్పుడున్న పరిస్దితుల్లో మద్యతరగతి మనిషి కడుపునిండా ముద్దతినలేక అల్లాడుతున్నాడు. ఇవేవి పట్టనట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇకపోతే వీటికి తోడు తెలంగాణలో డెంగ్యూ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డెంగ్యూ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్లు, ఇతర ఉన‍్నతాధికారులు గురువారం ఉదయం కోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది.


డెంగ్యూపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. దీన్ని బట్టి చూస్తుంటే మన బ్రతుకులు ఎంతంగా పైపై పూతలా ఉన్న బంగారంలా మెరిసిపోతున్నాయో అర్దం అవుతుందంటున్నారు. ఇకపోతే గతంలో కరుణ అనే వైద్యురాలు రాష్ట్రంలో వ్యాపిస్తున్న  డెంగ్యూ మరణాల నేపథ్యంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై గత కొంతకాలంగా హైకోర్టు ధర్మాసనం విచారణ చేపడుతోంది.


బుధవారం (అక్టోబర్ 23) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఆర్‌ఎన్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిల్‌పై మరోసారి విచారణ చేపట్టిన సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డెంగ్యూ మరణాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం చెందిందని హైకోర్టు మండిపడింది. రాష్ట్రంలో ఇంత గందరగోళం నెలకొన్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా డెంగ్యూ నివారణకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి? ఎంత మంది సిబ్బంది ఉన్నారు? తదితర పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది...


మరింత సమాచారం తెలుసుకోండి: