బీజేపీ పార్టీ ఏపీలో ఎలాగైనా బలపడాలని టీడీపీ నుంచి బడా బడా నాయకులను ఆకర్శిస్తుంది. ఇప్పటికే కడప నుంచి ఆది నారాయణ రెడ్డి కమలం గూటికి చేరుకున్నారు. అయితే రాయలసీమలో ముఖ్యంగా అనంతపురంలో మంచి పట్టు ఉన్న నేతగా పేరు పొందిన జేసి దివాకర్ రెడ్డిని బీజేపీలోకి లాగడానికి ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎందుకో జేసి బీజేపీలోకి చేరాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఏపీలో ఇప్పటి వరకు బీజేపీకి కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీలోకి పొతే ఒరిగేదేమి లేదని జేసి భావించవచ్చు. అయితే జేసి ఫ్యామిలీ వైసీపీ పార్టీ వైపు ఆసక్తిగా చూస్తున్నా .. జగన్ మాత్రం వీరిని పట్టించుకోవటం లేదు. 


అయితే ఇప్పటికే టీడీపీ పార్టీ నుంచి నాయకులూ వేరే పార్టీలకు జంప్ అయ్యారు. టీడీపీకి ఉన్న ఆర్ధిక మూల స్థంభాలైన నలుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయిన సంగతీ విధితమే. దీనితో టీడీపీ పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఎన్నికల ముందు టీడీపీ మునిగిపోయే నావ అని కొంత మంది ముందుగానే అర్ధం చేసుకొని వైసీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీలో ఉండిపోయిన నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. దీనితో ఇప్పుడు ఈ నేతలు టీడీపీలో ఉండి తప్పు చేశామని ఆఫ్ ది రికార్డు చర్చించుకుంటున్నారు.   


టీడీపీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో నేతలందరికీ అర్ధం అయ్యింది. పైగా చంద్రబాబుకు వయసు కూడా అయిపోవడంతో ఆ పార్టీని వదిలిపెట్టడం మంచిదని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారందరు ఎందుకు పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందే. వైసీపీ తలుపులు తెరిస్తే చాలు ... వెంటనే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్  ఆ పని చేయడని తెలుసు కాబట్టి చంద్రబాబు నిర్భయంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: