తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు విడుదల కానున్నాయి . తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూర్నగర్ ఎన్నికల ఫలితాల వైపే చూస్తున్నాయి. ఈ ఫలితాలలో గెలుపు ఎవరిని వరిస్తుందో అని అన్ని పార్టీల నాయకులు తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హుజూర్నగర్ ఉప ఎన్నికలను తీసుకున్నాయి  అన్ని పార్టీలు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి... ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ పద్మావతి.... టిడిపి పార్టీ నుంచి చావా కిరణ్ మై... బిజెపి పార్టీ నుంచి రామారావు లు ఈ ఉప ఎన్నికల్లో పోటీ పడ్డారు . ఇంకొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉప ఎన్నికల బరిలో నిలిచారు. 

 

 

 

 

 

 అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ రెండో దఫా పాలనకు నిలువుటద్దంగా మారనున్నాయి . రెండోసారి భారీ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకున్న టిఆర్ఎస్ పార్టీ... తమ అధికారం, నిర్ణయాలు, పథకాలతో ప్రజలను సంతృప్తిపరిచిందా  లేదా అన్నది హుజూర్నగర్ ఎన్నికల్లో తేలనుంది . ఇదిలా ఉంటే ఓ వైపు గత ఎలక్షన్లలో హుజూర్నగర్ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ... ఈసారి ఉప ఎన్నికల్లో కూడా తమదే  గెలుపు అంటూ ధీమాతో ఉంది. ఇక  బిజెపి అయితే గతంలో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచి అధికార పార్టీని షాక్ ఇచ్చినట్లే  ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా గెలవాలని అనుకుంటుంది. 

 

 

 

 

 అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి మధ్య ఉన్నప్పటికీ.... ఎగ్జిట్ పోల్స్ నిర్ణయం మాత్రం టిఆర్ఎస్ ఏ విజయం సాదిస్తుందని తెలిపాయి . అయితే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె... ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్  తీరు హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంచనా కూడా ఉంది. అంతేకాకుండా హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కావడం... ఇప్పటివరకు హుజూర్నగర్ లో ఒక్క సారి కూడా టిఆర్ఎస్ గెలవకపోవడం ఇలాంటి అంశాలు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో విజేత ఎవరనే దానిపై ఆసక్తిని  కలిగిస్తున్నాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే... కాంగ్రెస్ కంచుకోట లాంటి హుజూర్నగర్ లో మొదటిసారిగా గెలిచింది టిఆర్ఎస్ పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి గెలిస్తే... కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానం  కాపాడుకోవడమే కాక సమ్మె ప్రభావం  టిఆర్ఎస్ పార్టీపై పడినట్లు భావించవచ్చు .కాగా  22 రౌండ్లలో కౌంటింగ్ ఫలితాలు వెల్లడించ నుండగా నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: