మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల లెక్కింపు మొదలైంది.  ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల లెక్కింపు మొదలవ్వగా ప్రారంభం నుంచి బీజేపీ దూసుకుపోతున్నది. ముందస్తు సర్వేలు చెప్పినట్టుగానే కాషాయం, శివసేన పార్టీలు మహాలో దూసుకుపోతున్నాయి.  ఎన్డీయే విజయం సాధించడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది.  అయితే ఎంత మేర విజయం సాధిస్తుంది.  ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  


మహారాష్ట్రలో ఎన్డీయే దూసుకుపోతున్నది.  ఎన్డీయే విజయం ఖాయం అని తేలిపోయింది.  బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేయగా, శివసేన 125 స్థానాల్లో పోటీ చేసింది.  కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేశాయి.  కాంగ్రెస్, ఎన్సీపీలు తమదే విజయం అని చెప్తున్నా.. ముందస్తు సర్వేలు మాత్రం ఎన్డీయే కు అనుకూలంగా ఉండటంతో.. తుది ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది మరికాసేపట్లోనే తేలిపోనుంది.  అటు హర్యానాలోను బీజేపీ దూసుకుపోతున్నది. 


మొత్తం 90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె.. మహారాష్ట్రలోని ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా బీజేపీ లీడింగ్ లో ఉండటం విశేషం.  ఎంఐఎం అక్కడి నుంచి పోటీ చేస్తోంది.  ముస్లిం ఓటర్లను టార్గెట్ చేసుకొని ఎంఐఎం పోటీ చేసినా ఈసారి ఫలితం వేరేలా ఉండేలా కనిపిస్తోంది.  ఇప్పటికే బీజేపీ.. శివసేన పార్టీలు ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి.  


ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపును బట్టిమిగతా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఎలా ప్రవర్తిస్తుంది అన్నది తెలుస్తుంది.  వచ్చే ఏడాది ఢిల్లీ, బీహార్ కు ఎన్నికలు జరగబోతున్నాయి.  అలానే, 2021లో బెంగాల్ ఎన్నికలు, గుజరాత్ కు కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నది.  2021లో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి.  తమిళనాడు ఎన్నికల్లో ఈసారి బోణి కొట్టాలని బీజేపీ చూస్తున్నది.  ఈసారి ఎన్నికల్లో బీజేపీ బోణి కొడితే.. దాన్ని ఆసరాగా చేసుకోని తప్పకుండా బీజేపీ తమిళనాడులో బలపడేందుకు ప్రయత్నం చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: