వాహనదారులకు శుభవార్త.. దేశంలో ఇంధన ధరలు మళ్ళీ దిగొచ్చాయి. ఈరోజు (గురువారం) పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు చొప్పున తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.81కు తగ్గింది. డీజిల్ ధర రూ.72.03కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.77.42కు క్షిణించగా, డీజిల్‌ ధర 5 పైసలు క్షీణతతో రూ.71.33కు చేరింది. 


ఇక విజయవాడలోనూ పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు 5 పైసలు చొప్పున దిగొచ్చాయి, దీంతో పెట్రోల్ ధర రూ.77.05కు క్షీణించింది. డీజిల్ ధర రూ.70.99కు తగ్గింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. దీని బట్టి చూస్తే పెట్రోల్, డీజల్ ధరలు రేపు కూడా ఇదే విధంగా భారీగా తగ్గే అవకాశలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.


కాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.73.17 కు క్షిణించగా, డీజల్ ధర కూడా 5 పైసలు క్షణతతో రూ. 66.06కు చేరింది. ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ ధర 5 పైసలు, డీజల్ ధర 5 పైసలు తగ్గుదలతో కొనసాగుతున్నాయి. కాగా గత నెల రోజులుగా పెట్రోల్, డీజల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కేవలం ఒక నెలలో దాదాపు ఒకటైనార రూపాయి పెట్రోల్, డీజల్ పై తగ్గింది. ఇది ఇలాగె కొనసాగితే పెట్రోల్, డీజల్ ధరలు పాత రేట్లకు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: