హుజూర్ నగర్ ఉప ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఇరవై రెండు రౌండ్లలో ఫలితాలు వెల్లడించనున్నారు . అయితే హుజూర్నగర్ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అటు పార్టీలే  కాకుండా మొత్తం తెలంగాణ ప్రజానీకం  హుజూర్నగర్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని పార్టీలు గెలుపు పై ధీమాతో ఉన్నారు. 

 

 

 టిఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మావతి రెడ్డి బీజేపీ నుంచి రామారావు టిడిపి నుంచి చావాకిరణ్మై లు బరిలో ఉండగా ఇంకొంత మంది   స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉప ఎన్నికల బరిలో నిలిచారు. అయితే వీరంతా ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ మహాశయులారా ఆకట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎవరివైపు ఓటర్లు మొగ్గుచూపారన్నది   కొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఈసారి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవాలని టిఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది . 

 

 

 అటు కాంగ్రెస్ కూడా తన సిట్టింగ్ స్థానాన్ని  కాపాడుకుని  మరోసారి విజయం సాధిస్తామని ధీమా తో ఉంది . ఒక హుజూర్నగర్ లో కౌంటింగ్ మద్దులవ్వగా  మొదటి రౌండ్  ఫలితాలు విడుదల చేశారు. కౌంటింగ్ మొదటి రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి  సైదిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 2580 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో కూడా బిజెపి హవా  నడిపిస్తూ ఆధిక్యంతో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: