తెలుగు సాహిత్యంలో అమరావతి కధలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆధునిక ఆంధ్రాలో లో అమరావతి పేరుకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అ అంటే అమరావతి అని టీడీపీ టెక్స్ట్ బుక్కులు నాలుగేళ్ళుగా చెప్పాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ బి అంటే భ్రమరావతి అని తమ కొత్త పుస్తకాలు తెచ్చి పాఠాలు చెబుతోంది. ఇపుడు రాజధాని ఏది ఎక్కడా అన్నది ప్రశ్న కాదు, అది సామాన్యుడుకి కూడా పెద్దగా పట్టని విషయం. అక్కడ అసలు కధేంటి అన్నదే అసలైన మ్యాటర్. . అందుకే అ అంటే అవినీతి, బి అంటే బినామీ అంటోంది కొత్త టెక్స్ట్ బుక్


నాలుగేళ్ళ క్రితం సరిగ్గా అంటే 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు,  అప్పటికి మంత్రి కూడా కాని లోకేష్, ఆయన గారి కొడుకు ఏడాది వయసు ఉన్న దేవాన్ష్, ఇక బాబు గారి సతీమణి భువనేశ్వ‌రి, కోడలు బ్రాహ్మణి ఇలా మొత్తం బాబు గారి ఫ్యామిలీ కధగా ఈ అమరావతి ఫౌండేషన్ ఎపిసోడ్ జరిగిపోయింది.


అక్కడ ప్రధాన‌ ప్రతిపక్ష నేత జగన్ కనిపించలేదు, ఆయన ఎమ్మెల్యేలు కూడా లేరు. అతి పెద్ద విపక్షంగా ఉన్న వైసీపీ రాని ఈ శంకుస్థాపనకు నాడే దిష్టి తగిలేసింది. అదిపుడు నాలుగేళ్ళ తరువాత మెల్లగా కధ నడుపుతోంది అంతే. నిజానికి రెండు రోజుల క్రితం  అక్టోబర్ 22న బాబు సిక్కోలులో ఉన్నారు. ఆయన ఒక్కరే నాలుగేళ్ళ నాటి ఫౌండేషన్  ముచ్చటను క్యాడర్ తో చెప్పుకుని బాధపడ్డారు. బంగారు బాతు గుడ్డు లాంటి అమరావతిని చంపేస్తున్నారంటూ తెగ ఫీల్ అయ్యారు కూడా.


సరే అదంతా గతం. కానీ అదే నాలుగేళ్ళ క్రితం ఫౌండేషన్  వేసిన అమరావతిలో ఇప్పటికి కూడా ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ లేదేమని బాబు గారిని అడగకూడదు, అంతా టెంపరరీ అంటూ బాబు గారు విలువైన కాలమంతా గడిపేశారు. పైగా అక్కడ భూ సేకరణ, అస్మదీయులకు పంపిణీ ఇదే బిజీలో గత సర్కార్ పుణ్యకాలం నెట్టుకొచ్చేసింది. తీరా చూస్తే అంతా సర్దుకున్నాం అనుకున్నాక ఎన్నికలు వచ్చేసాయి. వైసీపీ సర్కార్ ఏర్పడింది.

రాజధాని అంటే ఒక్క సామాజికవర్గానికి చెందినది కాదు అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అది  నిజమే. స్థాన బలమో మరోటో ఒక  ప్రజా రాజధానిలో ఎవరి ఆధిపత్యాన్ని సహించదు. రాజధాని అంటే మొత్తం 13 జిల్లాల్లో ఉన్న ప్రజలు, అన్ని సామాజిక వర్గాల సమతూల్యతలో ఉండాలి. ఆ విధంగా అమరావతి రాజధాని లేకపోవడం వల్లనే ఇపుడు బీట్లు వారింది, నిర్మాణం లేకుండానే కూలిపోయింది.


ఇపుడు జగన్ సర్కార్ ఓ విధంగా బాబు గారి అమరావతి కధలకు కాలం చెల్లిందనే చెబుతోంది. వైసీపీ నిర్మించే రాజధాని పెదబాబు, చినబాబు ఆశలకు ప్రతిబింబంగా ఉండదు అన్నది పచ్చి నిజం. ఇక అన్ని వర్గాలు కూడా రాజధానిలో ఉండేలా కొత్త సర్కార్ నిర్ణయం తీసుకుంటే పూర్తిగా ప్రజా మద్దతు దక్కుతుంది. ఆ మీదట టీడీపీ తమ్ముళ్ళు ఎన్ని రాగాలు పెట్టినా కూడా ఎవరూ పట్టించుకోరేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: