ఉత్కంఠంగా సాగుతున్న హుజూర్‌నగర్ ఉప-ఎన్నిక ఫలితం. ఎవరు  ఈ స్దానాన్ని కైవసం చేసుకుంటారనే ఆసక్తి ఇప్పుడు ఇక్కడ మొదలైంది. ఇకపోతే యావత్తు తెలంగాణ ప్రజల ఎదురు చూపులకు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ఇకపోతే గురువారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్‌లోనే లెక్కింపు జరుగుతోంది. లెక్కింపునకు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్లు జరగనుంది. ఇందుకు 20 నుంచి 40 నిమిషాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. రిటర్నింగ్‌ అధికారికి ప్రత్యేకంగా మరో టేబుల్‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆయన ఈ ప్రక్రియను పరిశీలిస్తారు.


ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్, పరిశీలకుడిని నియమించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకుడు సచీంద్ర ప్రతాప్‌ సింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రౌండుకు ర్యాండమ్‌గా రెండు ఈవీఎంల ఫలితాలు సరిచూసిన తర్వాతే.. ఫలితాన్ని వెల్లడిస్తారు.ఇక తొలుత లెక్కింపులో భాగంగా ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సర్వీసు ఓట్ల లెక్కించనున్నారు.  మొత్తంగా 8.30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండుకు 20 నిమిషాలు సమయం పడుతుంది. 21 రౌండ్లు పూర్తిస్థాయిలో, 22వ రౌండు పాక్షికంగా జరుగుతుంది.


తుది ఫలితం మధ్యాహ్నం 12.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం మాత్రం హుజూర్‌నగర్ తొలి రౌండ్‌ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 2500పైచిలుక ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. అంతేకాకుండా రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్‌కు 4 వేల ఓట్ల ఆధిక్యం దక్కింది..ఆ తర్వాత కూడా మూడో రౌండ్ పూర్తియ్యేసరికి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 6,500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. మొత్తంగా ప్రస్తుత పరిస్దితిని బట్టి చూస్తే కారు ఇక్కడ అసలు బ్రేకులనే తీసి పరుగెడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులను చూస్తుంటే గులాభిపార్టీ ముఖాల్లో విజయం తమదేననే ఉత్సాహం పిడుగు మెరుపుకంటే కాంతివంతంగా ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: