మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాల శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.  10 గంటలకల్లా కౌంటింగ్‌ పై క్లారిటీ రానున్న‌ప్ప‌టికీ....మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో..ఊహించిన‌ట్లే..బీజేపీ గెలుపు బాట‌లో సాగుతోంది. ప్ర‌ధానంగా రాజ‌కీయ నేత‌ల వార‌సులు ముందంజ‌లో ఉన్నారు. యువ సేన చీఫ్ ఆదిత్య థాక‌రే.. సౌత్ ముంబై నుంచి పోటీలో ఉన్నారు. థాక‌రే కుటుంబం నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న మొద‌టి వ్య‌క్తి ఈయ‌నే కానున్నారు. ఆదిత్య‌కు పోటీగా సురేశ్ మానే నిలిచారు. ద‌ళిత భావ‌జాలం ఉన్న సురేశ్ మానే.. ఎన్సీపీ పార్టీ త‌ర‌పున రేసులో ఉన్నారు. వ‌ర్లీ సీటు నుంచి ఆదిత్య థాక‌రే .. ఆధిక్యంలో ఉన్నారు. 


మ‌రోవైపు, ఎన్సీపీ అధినేత శ‌రద్ ప‌వార్ కుటుంబంలోని మ‌రో యువ‌నేత సైతం ఆధిక్యంలో సాగుతున్నారు. ప‌వార్ కుటుంబంలో కీల‌క వ్య‌క్తి అయిన అజిత్ ప‌వార్ బారామ‌తి స్థానం నుంచి బ‌రిలో నిలిచారు. ఎన్సీపీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం అయిన అజిత్ ప‌వార్‌.. 1991 నుంచి బారామ‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా గెలుస్తూనే ఉన్నారు. బీజేపీ-శివ‌సేన అభ్య‌ర్థి గోపిచంద్ ప‌డాల్క‌ర్ ప్ర‌త్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అజిత్ ప‌వార్‌ ముందంజ‌లో ఉన్నారు. 


 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేయగా.. 90 సీట్లున్న హర్యానాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మరో 16 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలూ వెలువడనున్నాయి.  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ ల స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు చివరగా జరగనుంది. మధ్యాహ్నానికి పూర్తి వివరాలను అధికారులు ప్రకటించనున్నారు. ప్ర‌స్తుతానికి మహరాష్ట్రలో బీజేపీ 52 స్థానాలు, కాంగ్రెస్ 12 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా..హర్యానాలో బీజేపీ 13 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: