మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ దూసుకెళుతోంది. ఆ పార్టీ అభ్యర్థులు సుమారు 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నట్లుగా సమాచారం . హరియాణాలో మాత్రం బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ శివసేన పార్టీలు కలిసి పోటీ చేయగా కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా బీజేపీ శివసేన కూటమి దూసుకెళుతోంది. 
 
తొలి రౌండ్ లోనే బీజేపీ శివసేన కూటమి 169 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి కూటమిగా పోటీ చేయగా ఎన్సీపీ ఎక్కువ స్థానాల్లో ముందున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థులు అందరూ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ మూడు వేల ఓట్ల ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నట్లు సమాచారం. 
 
నాగ్ పూర్ సౌత్ వెస్ట్ లో సీఎం ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారు. కర్నాల్ లో ఆధిక్యంలో హరియాణా సీఎం ఖట్టర్ ఉన్నారు. వర్లిలో యువసేన అధినేత అదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు. పరిల్ లో పంకజ్ ముండే ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కూడా ముందంజలో ఉన్నారు. బరోడాలో యోగీశ్వర్ దత్ ముందంజలో ఉన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో మాత్రం కారు జోరు కొనసాగుతోంది. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి 9,400 ఓట్ల ఆధిక్యంతో సైదిరెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొదటిసారి హుజూర్ నగర్ నియోజకవర్గంలో సత్తా చాటబోతుందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ టీఅర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: