హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కారు జోరు ముందు ప్ర‌ధాన పోటీ దారు కాంగ్రెస్ పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఇంకా చెప్పాలంటే రౌండ్ రౌండ్‌కు కారు జోరు పెరిగిపోతోంది. కాగా.. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఎన్నికల ప్రచారంలో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. అదే పోటీ కౌంటింగ్‌లో ఎక్కడా కనపడలేదు.


నాలుగు రౌండ్ల‌కే టీఆర్ఎస్‌కు ఏకంగా 11 వేల పైచిలుకు మెజార్టీ వ‌చ్చింది. ఈ లెక్క‌న 21 రౌండ్లు కంప్లీట్ అయ్యే స‌రికి మొత్తం 30 వేల పై చిలుకు మెజార్టీ రానుంది. కాగా.. ఈ ఫలితంపై తెలంగాణతో పాటు ఏపీ ప్రజల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణలో పోటీ చేయ‌ని టీడీపీ స‌వాళ్లు రువ్వి మ‌రీ ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసింది.


త‌మ పార్టీ అభ్య‌ర్థిగా చావా కిర‌ణ్మ‌యిని రంగంలోకి దింపింది. ఇక ఫ‌లితాల్లో ఆ పార్టీకి ఘోర‌మైన అవ‌మానం మిగిలింది. మొదటి రెండు రౌండ్ల‌లో టీడీపీ అభ్య‌ర్థి కిర‌ణ‌మ్మకి కేవ‌లం 113, 182 ఓట్లు వ‌చ్చాయి. అంటే రెండు రౌండ్ల‌కు క‌లిపి టీడీపీకి 300 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇది ఆ పార్టీ ఘోర‌మైన ప‌రిస్థితి తెలియ‌జేస్తోంది. ఇక బీజేపీ కూడా టీడీపీకి పోటీగా ఓట్లు తెచ్చుకుంటోంది. ఆ పార్టీకి తొలి రౌండ్లో 128, రెండో రౌండ్లో 298 ఓట్లు సాధించింది.


ఇదిలా ఉంటే.. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి 6,777 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి సైదిరెడ్డి 9,356 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఏడో రౌండ్ కంప్లీట్ అయ్యే స‌రికి టీఆర్ఎస్ 14,300 ఓట్ల‌తో దూసుకుపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: