హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు  లెక్కింపు జరుగుతోంది,2019 ఏప్రిల్ లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తరువాత అధికార పార్టీకి విజయం అవసరం.2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కాంగ్రెస్‌కు కూడా ఈ ఫలితం కీలకం.గురువారం ఉదయం 8 గంటలకు సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్‌లో లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత చూపుతున్నారు.

లెక్కింపునకు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్లు జరగనుంది. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్, పరిశీలకుడిని నియమించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకుడు సచీంద్ర ప్రతాప్‌ సింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రౌండుకు ర్యాండమ్‌గా రెండు ఈవీఎంల ఫలితాలు సరిచూసిన తర్వాతే.. ఫలితాన్ని వెల్లడిస్తున్నారు.లెక్కింపులో భాగంగా తొలుత ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సర్వీసు ఓట్ల లెక్కించారు. తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండుకు 20 నిమిషాలు సమయం పడుతుంది. 21 రౌండ్లు పూర్తిస్థాయిలో, 22వ రౌండు పాక్షికంగా జరుగుతుంది. తుది ఫలితం మధ్యాహ్నం 12.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది.


రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్‌కు 4 వేల ఓట్ల ఆధిక్యం.


మూడో రౌండ్ పూర్తియ్యేసరికి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 6,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


హుజూర్‌నగర్‌లో పూర్తయిన నాలుగో రౌండ్ లెక్కింపు.. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి 9,356 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.


ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి 11 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి.


కాంగ్రెస్‌కు పట్టున్న నేరేడుచర్లలో 10 వేలకుపైగా మెజార్టీ ఓట్లు సాధించిన టీఆర్ఎస్.


ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థిపై 12,300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.


పూర్తయిన ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు.. 14,300 ఓట్ల వెనకంజలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి.


మరింత సమాచారం తెలుసుకోండి: