తెలంగాణ‌లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ హవా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ ఉప ఎన్నిక‌ల్లో కారు జోరు మామూలుగా లేదు. భారీ మెజారిటీ దిశగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి అడుగులేస్తున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి 9వేల 356 ఓట్ల మెజారిటీతో సైదిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఇక ఏడు రౌండ్లు ముగిసే స‌రికే కారు పార్టీ ఏకంగా 14 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతోంది.


ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉన్నారు. గ‌ట్టి పోటీ ఇస్తుంద‌నుకున్న ప‌ద్మావ‌తి రెడ్డి ఫ‌లితాల్లో తేలిపోయారు. ఇక స‌త్తా చాటుతామ‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన టీడీపీ, బీజేపీ ఘోర‌మైన అవ‌మానం మూట‌క‌ట్టుకున్నాయి. బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో ఉండగా… టీడీపీ అభ్యర్థి కిరణ్మయి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. ఈ రెండు పార్టీల అభ్య‌ర్థుల‌కు కేవ‌లం 300 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.


ఈ ఫ‌లితాల ట్రెండ్ చూస్తుంటే హుజుర్‌నగర్‌ స్థానాన్ని కాంగ్రెస్ భారీ ఓట్ల తేడాతో కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. డిసెంబ‌ర్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి 7 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఇక ఈ యేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అదే ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి ఏకంగా 13 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.


ఇక ఇప్పుడు టీఆర్ఎస్‌కు కంప్లీట్ అయ్యేస‌రికి 30-35 వేల ఓట్ల మెజార్టీ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రౌండ్ రౌండ్‌కు మెజారిటీ అమాంతం పెరుగుతుండడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. ఏదేమైనా ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితం ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి రాజ‌కీయ కెరీర్‌కే పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.


ఇక టీడీపీ, బీజేపీ ప‌రిస్థితి తెలంగాణ‌లో ఎన్ని గొప్ప‌ల‌కు పోయినా రాష్ట్ర స్థాయిలో మాత్రం కేసీఆర్‌కు తిరుగులేని మ‌రోసారి హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం ఫ్రూవ్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: