అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే నూటికి నూరు శాతం తమదే విజయం అనే ధీమాలో అధికార పార్టీ బీజేపీ ఎప్పటినుండో ఉంది. వారి ఆశలకు నీరు పోసినట్లుగా మహారాష్ట్ర, హరియాణా ప్రజలు కమలానికే పట్టం కడుతున్నారు. ఇకపోతే గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్ధులు పలు స్ధానాల్లో ముందంజలో దూసుకెళ్లుతున్నారు..


ఇప్పటివరకు అందిన ట్రెండ్స్‌ ప్రకారం, మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలకు గాను, బీజేపీ కూటమి 130 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా 46 స్ధానాల్లో యూపీఏ ముందంజలో ఉంది. ఇక హరియాణాలోనూ బీజేపీ 41 స్ధానాల్లో, కాంగ్రెస్‌ 29 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాగా మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు విజయంపై ధీమాతో బీజేపీ శ్రేణులు ఇప్పటి నుండే సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇదేగాకుండా వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఉప-ఎన్నికల కౌంటింగ్ కూడా సాగుతోంది. వీటిలో తెలంగాణలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం కూడా ఒకటి.


ఇకపోతే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత, ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం జరిగే అతిపెద్ద ఎన్నికలు ఇవి కావడంతో అందరి దృష్టి దీనిపైనే నిలిచింది.. ఇక ఇప్పటికే  బీజేపీ మహారాష్ట్ర, హరియాణాలో అధికారంలో ఉండగా, ఇప్పుడు కూడా విజయం తిరిగి తమదే అని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. మహారాష్ట్రలో శివసేనతో జట్టుకట్టిన బీజేపీ 164 చోట్ల బరిలో నిలవగా. మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో పోటీలో ఉంది.. మహారాష్ట్రలో 81 స్థానాల్లో బీజేపీ కూటమి, 43 స్థానాల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. హరియాణాలో బీజేపీ 36, కాంగ్రెస్ 10, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి మహారాష్ట్రలో బీజేపీ కూటమి 119, కాంగ్రెస్ కూటమి 44 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.


హరియాణాలో తొలి రౌండ్ ముగిసేసరికి బీజేపీ 40, కాంగ్రెస్ 29, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. హరియాణాలో కర్నాల్ స్థానంలో సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఆధిక్యతలో ఉండగా, మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడణ్‌వీస్ నాగ్‌పూర్ సౌత్ స్థానంలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో  230 స్థానాల్లో తొలి రౌండ్ పూర్తవగా బీజేపీ-శివసేన కూటమి 164 స్థానాల్లోనూ, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 61 చోట్ల, ఇతరులు 10 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇకపోతే హరియాణాలోని బరోడా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రెజర్ల యోగేశ్వర్‌దత్ కూడా ఆధిక్యతలో ఉన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: