తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలు కౌంటింగ్ మొదలైంది  .ఉదయం  ఎనిమిది గంటలకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కాగా  హుజూర్ నగర్ లోని నూతన మార్కెట్ గౌడంలో  ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు. ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుల్లో ను అధికారులు ఏర్పాటు చేయగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోసం మరొక టేబుల్  ఏర్పాటు చేశారు. మొత్తం 20 రౌండ్లలో  హుజూర్నగర్ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు  అధికారులు . అయితే ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కాగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల అందరూ కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 

 

 

 

 కాగా  ఇప్పటికే హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో 7 రౌండ్ల  ఎన్నికల ఫలితాలను వెల్లడించారు అధికారులు. కాగా మొదటి రౌండ్  నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి అయిన సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి 14 వేల పైచిలుకు ఓట్లతో అధిక లో కొనసాగుతున్నారు టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. అయితే ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న  హుజూర్నగర్ లో కాంగ్రెస్ కంచుకోట కార్ స్పీడ్ తో బీటలు వారుతున్నట్లు అవుతుంది . హుజూర్ నగర్ విజయం పై  ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ... టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి  రభారీ షాక్ ఇస్తున్నారు. 

 

 

 

 

 హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపిస్తుండటంతో   హస్తం వ్యస్తం అవుతోంది. ఎన్నికలు ప్రతి రౌండ్లోనూ టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యతను సాధిస్తూ ఆధిక్యం తో  ముందుకు దూసుకెళుతోంది. అయితే ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ లో ఏ పార్టీ విజయం సాధించలేదు మొదటిసారి టిఆర్ఎస్ విజయం వైపు దూసుకు పోతోంది. చివరి 20 పూర్తయ్యేసరికి ఫలితం ఎవరివైపు మారుతుంది. చివరికి ఎవరు విజయం సాధిస్తారో అని అందరు ఆతృతగా,  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన 7 రౌండ్లో చూస్తుంటే టీఆర్ఎస్ పై  ప్రజలు మొగ్గు చూపినట్లు  కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: