దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న, తొలి అసెంబ్లీ ఎన్నికలు  కావడంవల్ల మహారాష్ట్ర మరియు హర్యానా ఎన్నికలలో ఎన్నికల మీద సర్వత్ర ఆసక్తి నెలకొన్నది. ఈ ఎన్నికలు మొన్న సోమవారం జరిగినది ,ఈ రోజు దాని కౌంటింగ్  ఉదయం ఎనిమిది గంటలకు అన్ని చోట్ల మొదలవుతుంది.


మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 150 స్థానాల్లో, శివసేన 124 స్థానాల్లో పోటీ చేశాయి. మిగతా స్థానాల్లో చిన్న మిత్రపక్షాలు పోటీ చేశాయి. మెజార్టీ మార్కు 145. ప్రస్తుతం బీజేపీ, శివసేన కూటమికి అసెంబ్లీలో 217 స్థానాలున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కలిపి 56 సీట్లున్నాయి.మొత్తం 11 ఎగ్జిట్ పోల్స్... బీజేపీ, శివసేన కూటమికి 211 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్, ఎన్సీపీకి 64 వస్తాయని అంచనా వేశాయి. గతంలో కంటే ఆ కూటమికి కాస్త ఎక్కువే వస్తాయని తెలిపాయి.


 హర్యానాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలుండగా... బీజేపీకి 66 వస్తాయనే అంచనా ఉంది. మొత్తం 7 ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పాయి. కాంగ్రెస్‌కి 14 సీట్లు వస్తాయని తెలిపాయి. మెజార్టీ మార్కు 46. బీజేపీ గెలిస్తే, మనోహర్ లాల్ ఖట్టర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు.శివసేన నుంచీ ఉప ముఖ్యమంత్రిగా ఆదిత్య థాక్రే నిలిచే అవకాశాలున్నాయి. ఆయన తాతగారు బాల్ థాక్రే పార్టీని స్థాపించిన తర్వాత... ఆ కుటుంబం నుంచీ ఎన్నికల్లో పాల్గొన్న మొదటి నేత ఆదిత్య థాక్రేనే.


 బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాల్నే ప్రస్తావించింది. పాకిస్థాన్, జమ్మూకాశ్మీర్, ఉగ్రవాదాన్ని ప్రస్తావించింది. కాంగ్రెస్ మాత్రం నిరుద్యోగం, రైతుల సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆర్థిక వ్యవస్థలో మందగమనం వంటి వాటిని ప్రస్తావించింది.ప్రచారం లో  బీజేపీ  జోరుగా ప్రచారం చేసింది. ప్రధాని మోదీ 16 ర్యాలీలు చెయ్యగా, అమిత్ షా 25 చేశారు. రాహుల్ గాంధీ కేవలం 7 ర్యాలీలే చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: