తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌న‌గర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. గురువారం సూర్యాపేట మార్కెట్ యార్డు ఆవ‌ర‌ణ‌లో ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ తొలి రౌండ్ నుంచే దూకుడుతో ముందుకు వెళ్లింది. అధికార పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఓడిన శానంపూడి సైదిరెడ్డి పోటీచేయగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి ఎన్నికల రంగంలో ఉన్నారు. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నకారు జోరు ముందు మిగిలిన పార్టీల అభ్య‌ర్థులు ఎవ్వ‌రూ ఆగే ప‌రిస్థితి లేదు.


కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నా కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తి రెడ్డి ఎంత మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసి నానా హంగామా చేసిన టీడీపీ, బీజేపీ ఫ‌లితాల్లో పూర్తిగా తేలిపోయాయి. బీజేపీ నుంచి పలువురి పేర్లు పరిశీలించి చివరకు బీసీ కోటాలో కోట రామారావుకు టిక్కెట్ ఖరారు చేసింది. ఇక టీడీపీ నుంచి హుజూర్‌న‌గర్ మాజీ జడ్పిటిసి చావా కిరణ్మయి రంగంలో ఉన్నారు.


ఎంత ఘోరంగా ఈ రెండు పార్టీల ప‌రువు పోయిందంటే... తొలి రెండు రౌండ్లు ముగిసే స‌రికి టీడీపీకి కేవ‌లం 300 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక బీజేపీకి టీడీపీ కంటే మ‌రో 10 ఓట్లు మాత్ర‌మే ఎక్కువ వ‌చ్చాయి. ఇక్కడ డిపాజిట్ దక్కాలంటే 33,000 ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తుంటే టీడీపీ , బీజేపీ కేవ‌లం 2-3 వేల ఓట్లు తెచ్చుకోవ‌డ‌మే గ‌గ‌నంగా ఉంది.


ఏదేమైనా ప‌రువు పోగొట్టుకోవ‌డంలో బీజేపీ వ‌ర్సెస్ టీడీపీ పోటీ ప‌డుతున్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అతి త‌క్కువ ఓట్లు తెచ్చుకుని మూడు, నాలుగు స్థానాల్లో ఉంటాయో ?  చూడాలి. ఏదేమైనా మూడో స్థానంలోనూ అతి త‌క్కువ ఓట్ల‌తో ఉండి స‌రికొత్త చెత్త చ‌రిత్ర క్రియేట్ చేసేందుకు ఈ రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: