తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలు కౌంటింగ్ మొదలైంది  .ఉదయం  ఎనిమిది గంటలకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కాగా  హుజూర్ నగర్ లోని నూతన మార్కెట్ గౌడంలో  ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు. ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుల్లో ను అధికారులు ఏర్పాటు చేయగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోసం మరొక టేబుల్  ఏర్పాటు చేశారు. మొత్తం 20 రౌండ్లలో  హుజూర్నగర్ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు  అధికారులు . అయితే ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కాగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల అందరూ కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 

 

 

 

 అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎనిమిదవ రెండు పూర్తయ్యేసరికి 17,000 ఓట్ల పైచిలుకు  మెజారిటీతో సైదిరెడ్డి దూసుకుపోతున్నారు . అయితే రెండవ స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతుండగా బిజెపి టిడిపి  కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతున్నాయి . అయితే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె హుజూర్ నగర్ ఉప ఎన్నికలల్లో తెరాస విజయంపై ప్రభావం చూపలేదని అర్థమవుతుంది. కాగా టిఆర్ఎస్ విజయ తీరాల వైపు హై స్పీడ్ తో దూసుకుపోతుంది. తన సొంత నియోజకవర్గంలోనే టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. 

 

 

 

 అయితే టీఆర్ఎస్ ముందునుంచి అనుకున్నట్టుగానే భారీ మెజార్టీని సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఇక బీజేపీ టీడీపీ అయితే కనీస పోటీ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ టీడీపీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఉండగా ... రెండవ స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బిజెపి,  నాలుగో స్థానంలో టీడీపీ కొనసాగుతోంది. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నికలు 8 రౌండ్ల ఫలితాలు  ఇప్పటికే  ఫలితాలు విడుదల అవ్వగా...  మొదటి రౌండు నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి సైది  రెడ్డి మెజారిటీ తో  దూసుకుపోతున్నారు ఎనిమిది రౌండ్లు  పూర్తయ్యే సరికి 17 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. కాంగ్రెస్ కంచుకోట లాంటి హుజూర్నగర్ లో టిఆర్ఎస్ జండా ఎగరబోతునట్లు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: