ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న హుజూర్‌నగర్ బైపోల్‌లో టీఆర్ఎస్ గెలుపు బాట‌లో సాగుతోంది టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని పెంచుకుంటూ భారీ మెజార్టీ వైపు దూసుకెళ్తున్నారు.. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 17400 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, ఇలా గెలుపు బాట‌న సాగ‌డం వెనుక‌....టీఆర్ఎస్ అనుస‌రించిన వ్యూహ‌మే కార‌ణ‌మ‌ని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌లైన నాటి నుంచి టీఆర్ఎస్ ప‌క్కా ప్ర‌ణ‌ళిక‌తో వ్య‌వ‌హ‌రించింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మార్గదర్శకంలో దాదాపు నెలరోజుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషితో ఉపఎన్నికలో ఆ పార్టీ విజయం బాట‌న సాగుతోంది. ఉపఎన్నికకు పార్టీ ఇంచార్జిగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌తో సమన్వయంతో వ్యవహరించారు. పెద్ద ఎత్తున నేత‌లు ప్ర‌చారం చేశారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఏ ఒక్క ఓటు విష‌యంలోనూ `లైట్ తీసుకోవ‌డం` అనే దోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌లేదు.

అందుకే టీఆర్ఎస్ వ్యూహం, పోల్ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిట్‌పోల్‌, ప్రీపోల్ రూపంలో ప‌లు సంస్థ‌లు వెల్ల‌డించారు. గ‌త‌ సోమవారం పోలింగ్‌ అనంతరం ఆరా, చాణక్య సంస్థలు ఫలితాలను ప్రకటించాయి. చాణక్య నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 53.73%, కాంగ్రెస్‌కు 41.04% ఓట్లు వస్తాయని తేలింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అన్ని మండలాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబర్చనున్నట్టు వెల్లడైంది. బీజేపీ, ఇతర పార్టీలు దరిదాపుల్లో కూడా రాలేదు. కాంగ్రెస్‌కు మినహా మిగిలిన పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని సర్వే ఫలితాల ద్వారా వెల్లడయ్యాయి. ఆరా నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 50.48%, కాంగ్రెస్‌కు 39.95%, ఇతరులకు 9.57% ఓట్లు వస్తాయని తేలింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 50శాతానికి పైగా ఓట్లు సాధిస్తారని రెండు సర్వేలూ పేర్కొనడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: