మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  మహారాష్ట్రలో బీజేపీ కూటమి మెజార్టీ మార్క్‌ను దాటేయగా బీజేపీ, శివసేన కూటమి 162 స్థానాల్లో ఆధిక్యంలో, కాంగ్రెస్ 65 స్థానాల్లో, ఇతరులు 17 స్థానాల్లో మెజార్టీలో ఉన్నారు. తాజా ఫలితాలతో బీజేపీ, శివసేన శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఇంతే కాకుండా లడ్డూలు, స్వీట్ బాక్సులు రెడీ చేసుకున్నారు కూడా. ఇకపోతే జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తాయని తెలిపాయి.


హరియాణాలో మాత్రం ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియా కొద్దిగా విరుద్ధంగా ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడించడంతో ఆ రాష్ట్ర ఫలితాలపై కాస్త ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే ఇప్పటివరకు తెలిసిన ఫలితాలను పరిశీలిస్తే. మహారాష్ట్రలో మూడు స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉండగా, కర్నాల్‌లో హరియాణా ముఖ్యమంత్రి మనోహార్‌ లాల్‌ ఖట్టర్‌ ముందంజలో ఉన్నారు. ఇక రాంపూర్‌ నియోజకవర్గం (ఉప ఎన్నిక ) లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా ఆధిక్యంలో ఉన్నారు. కొంకణ్‌ ప్రాంతంలో శివసేన ఆధిక్యం కొనసాగిస్తుండగా..


విదర్భలో బీజేపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రెజ్లర్‌ బబితా ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ముందంజలో ఉంది. శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే  వర్లి నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ దూసుకెళ్తుంది. నాగ్‌పూర్‌ సౌత్‌వెస్ట్‌ నుంచి బరిలో ఉన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముందంజలో ఉన్నారు. హరియాణాలో బీజేపీ ముందజలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో 25 స్థానాల ఆధిక్యంలో బీజేపీ కూటమి నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: