హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని మార్కెట్ గోడౌన్లలో కౌంటింగ్ నడుస్తోంది. కేంద్ర పారామిలిటరీ బలగాల పహారాలో, ఫుల్లుగా సీసీ కెమెరాలు పెట్టి... ఓట్ల లెక్కిస్తున్నారు. మొత్తం 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. 22 రౌండ్‌ల పాటు ఓట్లను లెక్కించనున్నారు.


తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాన్ని పావుగా ఉపయోగించుకునేందుకు రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి.ఉప ఎన్నికలో మొత్తం 2,36,842 మంది ఓటర్లున్నారు. 2,00,754 ఓట్లు పోలయ్యాయి. వాటిని లెక్కించడతోపాటూ... ప్రతి మండలానికీ 5 వీవీప్యాట్‌ల స్లిప్‌లను కూడా లెక్కిస్తారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.


TRS నుంచీ శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచీ పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచీ చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ప్రధానంగా పోటీ సైదిరెడ్డి, పద్మావతిరెడ్డి మధ్యే ఉన్నా.... విజయం టీఆర్ఎస్‌దేనని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.ఎనిమిది రౌండ్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్‌కు చెందిన పద్మావతి రెడ్డిపై టిఆర్‌ఎస్ అభ్యర్థి సైది రెడ్డి 17,400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.మిగిలిన రౌండ్లలో కూడ ఇదే రకమైన పరిస్థితి కన్పించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.


హుజూర్ నగర్లో మాత్రం గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం. ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి.ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు ..


మరింత సమాచారం తెలుసుకోండి: